జుట్టి (పంజాబీ: ਜੁੱਤੀ) లేదా పంజాబీ జుట్టి (పంజాబీ: ਪੰਜਾਬੀ ਜੁੱਤੀ) ఉత్తర భారతదేశం, పొరుగు ప్రాంతాలలోని ఒకరకమైన చెప్పులు. ఈ చెప్పులను సాంప్రదాయకంగా చర్మంతో తయారుచేసి దానిపై ఎంబ్రాయిడరీ అలంకరణలు చేస్తారు. పాతరోజుల్లో అసలైన బంగారు, వెండి దారాలను ఉపయోగించేవారు. కాలానుగుణంగా తీని తయారీలో మార్పులు వచ్చాయి. దీనిని రబ్బరు సోల్ తో కూడా తయారు చేస్తున్నారు. పంజాబీ జుట్టిలో వివిధ రకాలైన శైలులున్నాయి. ప్రస్తుతం పాటియాలా, అమృత్ సర్ ప్రారంతాలు ముఖ్యమైన జుట్టి హస్తకళలకు పేరొందిన నగరాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇచ్చటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు జరుగుతున్నాయి.[1][2][3] జుట్టీ చెప్పులు అనేక స్థానిక డిజైన్లలో లభ్యమవుతున్నాయి. దానిని రూపొందించిన హస్తకళాకారుని ప్రతిభ ఆధారంగా దీనిలో వివిధ శైలులు వచ్చాయి. అవి పెద్దవిగా యున్నందువల్ల వాటికి కుడి లేదా ఎడమ భేదాలు లేకుండా ఉంటాయి. పాదాల ఆకారానికి అనుగుణంగా తయారుచేయడానికి అధిక సమయం పడుతుంది. ఇవి సాధారణంగా సమంగా ఉన్న సోల్ వాడుతారు. పురుషులకు, మహిళలకు ఒకే రకమైన డిజైన్ తో తయారుచేస్తారు. కానీ పురుషుల చెప్పులకు చివరి వాడిగా ఉండే కొనను ఉంచుతారు. చివర సాంప్రదాయ మీసాలవలె మెలితిప్పే విధంగా తయారుచేస్తారు. వీటిని ఖుస్సా అని పిలుస్తారు. మహిలలకు వాడే జుట్టీలకు ఎవ్నుక భాగం మడమల వద్ద ఉండదు. ఈ జుట్టీలను వివాహ వేడుకలలోనూ, వివిధ ఉత్సవాల లోనూ వాడతారు. పంజాబ్ లోని అత్యధిక మహిళలు, పురుషులు ప్రతీ రోజూ వాడే విధంగా కూడా జుట్టీలు ఉంటాయి.[4]
అనేక పంజాబీ ఫోక్ సాంగ్స్ లలో జుట్టీల గురించి ప్రస్తావన ఉంది. అందులో "జుట్టీ కాసురీ పేరి నా పోరీ హై రబ్బా సను తుర్నా పాలే", "జుట్టీ లగ్దీ వైరియా మేరే" వంటి పాటల చరణాలలో ఈ పదాన్ని ఉపయోగించారు. [1]
అనేక రకాల జుట్టీలు మహిళలకు పురుషులకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పండగలలో ప్రత్యేక రకమైన జుట్టీలను ఆవు కాళ్ళకు తయారుచేస్తారు. భారతదేశంలో జుట్టీలను సాధారణంగా "మొజారీ"గా పిలుస్తారు. పాకిస్తాన్ లో దీని ప్రత్యామ్నాయ పేరు "ఖుస్సా". ఇవి ప్రస్తుతం పశ్చిమ ప్రాంతంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మొజాహీల వలె ఈ చెప్పులు చివరి భాగం పైకి ఉండే వక్రంగా ఉండే ఆకారంలో తయారుచేస్తారు. సాంప్రదాయకంగా తరతరాలకు దీనిలో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇవి సాంప్రదాయ భారతీయ పాదరక్షలుగా ఉన్నాయి.
అవి సాధారణంగా చర్మంతో చేయబడి దానికి కొన్ని దారాలతో ఎంబ్రాయిడరీతో అలంకరణం చేయబడి ఉంటాయి. కొన్ని జుట్టీలు చేతితో తయారై దానిపై అందమైన ఎంబ్రాయడరీ కలిగి ఉంటాయి.
ఈ సాంప్రదాయ చెప్పులు భారతదేశం లోని (ప్రత్యేకంగా పంజాబ్ లో) జమీందారులు, చౌదరిలు, నవాబులు, జాగీర్ధారులు మహారాజులు, మహారాణులు ధరిస్తారు. అనేక రకాలైన జుట్టీలు ప్రత్యేక అలంకరణలతో మొఘల్ కాలం నాటినుండి వచ్చాయి. అన్ని జుట్టీలు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోని నైపుణ్యం ఉన్న పనివారు చేతితో తయారు చేసేవారు. జుట్టీ అనునది ఉత్తర భారతదేశంలో ప్రాముఖ్యత పొందాయి. ప్రత్యేకంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లలో ఎక్కువగా ధరిస్తారు. ఇవి కుస్షా, మొజ్రి కంటే భిన్నంగా ఉండేవి.