జెండాపై కపిరాజు | |
---|---|
దర్శకత్వం | సముద్రఖని |
రచన | సముద్రఖని |
నిర్మాత | కె.ఎస్. శ్రీనివాసన్ |
తారాగణం | నాని శరత్ కుమార్ శివ బాలాజీ అమలా పాల్ రాగిణి ద్వివేది గౌరీ నంద |
ఛాయాగ్రహణం | ఎం. సుకుమార్ - ఎం. జీవన్ |
కూర్పు | ఎస్.ఎన్. ఫాజిల్ |
సంగీతం | జి. వి. ప్రకాష్ కుమార్ |
నిర్మాణ సంస్థ | వాసన్ విజువల్ వెంచర్స్ |
విడుదల తేదీ | 21 మార్చి 2015 |
దేశం | భారతదేశం |
భాష | తెలుసు |
జెండాపై కపిరాజు 2015, మార్చి 21న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని, శరత్ కుమార్, శివ బాలాజీ, అమలా పాల్, రాగిణి ద్వివేది నటించగా,[2] జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.[3] ఈ చిత్రం ఏకకాలంలో తమిళంలో నిమింధు నిల్ గా జయం రవితో రూపొందించబడి, 2014లో విడుదలయింది. నాని తన కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. తమిళ సినిమా ఉన్నప్పటికి 2018లో తెలుగు చిత్రం తమిళంలో వెలన్ ఎత్తుత్తిక్కు పేరుతో అనువాదంచేసి విడుదలచేశారు.[4]
అవినీతిని అస్సలు సహించలేని అరవింద్ (నాని) కొందరు ప్రభుత్వ ఉద్యోగులని టార్గెట్ చేసి వాళ్ల బండారం బయటపెడతాడు. కౌంటర్ ఎటాక్‌లో వాళ్లు అరవింద్‌కి ఎదురుగా అచ్చంగా అలాగే ఉన్న మాయాకన్నణ్‌ని (నాని) తెచ్చి నిలబెడతారు. విజయం సాధిస్తున్నానని అరవింద్ అనుకుంటోన్న సమయంలో ఎదురు పడిన మాయాకన్నణ్ వల్ల మొత్తం రివర్స్ అవుతుంది. మరి అరవింద్ అనుకున్నది సాధిస్తాడా లేదా అన్నది మిగతా కథ.
2013, ఆగస్టు 1న అన్నపూర్ణ స్టూడియోలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. మొదటి షెడ్యూల్ షూటింగ్ ఒక రోజు తరువాత ప్రారంభమైంది.[5] నాని 24 ఏళ్లు,18 ఏళ్లు ఉన్న వ్యక్తిగా ద్విపాత్రాభినయం చేశాడు. అమలా పాల్ రెండు భాషల్లో ప్రధాన పాత్రలో నటించింది.[6] వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కెఎస్ శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.[7] ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలో మేఘనా రాజ్ నటింస్తుందని వార్తలు వచ్చాయి.[8] కానీ తను ఈ చిత్రంలో నటించడం లేదని ట్విట్టర్‌లో తెలిపింది.[9] రాగిణి ద్వివేది ఒక ప్రధాన పాత్రలో నటించింది.[10] 2013, మార్చి నాటికి ఈ చిత్రం షూటింగ్ 50% పూర్తయి, నాని పుట్టినరోజున ఫస్ట్‌లుక్ విడుదల చేయబడింది.[11] అదే నెలలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభమైంది. అక్కడ 3 వారాలపాటు నాని, అమలా పాల్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు.[12] 2013, నవంబరు 26న నాని తన ట్విట్టర్‌లో ఈ చిత్రంలోని తన రెండు పాత్రలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశాడు.[13] 2013, డిసెంబరు 5న పత్రికా నోట్ విడుదలచేసి, ఆ రోజు ఈ చిత్రీకరణ పూర్తయిందని ప్రకటించారు.[14] 2015, మార్చి 21న ఈ చిత్రం విడుదలైంది.[1]
జెండాపై కపిరాజు | ||||
---|---|---|---|---|
పాటలు of జెండాపై కపిరాజు by జి.వి. ప్రకాష్ కుమార్ | ||||
Released | 28 డిసెంబరు 2013 | |||
Recorded | 2012 | |||
Genre | సినిమా పాటలు | |||
Length | 19:29 | |||
Language | తెలుగు | |||
Label | సరిగమ | |||
Producer | జి.వి. ప్రకాష్ కుమార్ | |||
జి.వి. ప్రకాష్ కుమార్ chronology | ||||
|
ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషలో జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. రెండు భాషల్లో పాటలకు అవే ట్యూన్లు ఉన్నాయి. 2013, డిసెంబరు 28న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో సరిగమ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[15] ఈ చిత్రంలోని పాటలను అనంత శ్రీరాం రాశాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "ఇంతందంగా" | జావేద్ ఆలీ, షాష, జి. వి. ప్రకాష్ కుమార్ | 03:25 | ||||||
2. | "డోంట్ వర్రీ బీ హ్యాప్పీ" | జై శ్రీనివాస్, ప్రియా హిమేష్ | 03:38 | ||||||
3. | "రాజాధిరాజా" | హేమచంద్ర | 04:34 | ||||||
4. | "తెలిసింది" | హరిచరణ్, సైంధవి | 04:31 | ||||||
5. | "గీతా వర్సెస్" | హరిచరణ్ | 03:19 | ||||||
19:29 |