గెరాల్డ్ కోయెట్జీ (జననం 2000 అక్టోబరు 2) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. [1][2] 2017 డిసెంబరులో అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [3] 2019 జనవరిలో భారత పర్యటనకు ముందు దక్షిణాఫ్రికా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు జట్టులో ఎంపికయ్యాడు. [4]
2018 అక్టోబరు 14 న 2018–19 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో కోయెట్జీ తన తొలి లిస్టు A మ్యాచ్ ఆడాడు.[5] 2019 ఏప్రిల్ 12 న 2018–19 CSA T20 ఛాలెంజ్‌లో నైట్స్ కోసం తన ట్వంటీ20 రంగప్రవేశం చేసాడు [6] అతను 2019 అక్టోబరు 7 న 2019–20 CSA 4-డే ఫ్రాంచైజ్ సిరీస్‌లో నైట్స్ కోసం తొలి ఫస్ట్-క్లాస్ ఆట ఆడాడు [7] 2019 డిసెంబరులో అతను, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [8] ఏప్రిల్ 2021లో దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు ఫ్రీ స్టేట్ జట్టులో ఎంపికయ్యాడు. [9] 2021 మే 1 న, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సమయంలో లియామ్ లివింగ్‌స్టోన్‌కు బదులుగా రాజస్థాన్ రాయల్స్ అతన్ని తీసుకుంది.[10] 2023 జూన్‌లో, కోట్జీ మేజర్ లీగ్ క్రికెట్ ప్రారంభ సీజన్ కోసం టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు.[11]
2022 జూన్‌లో కోయెట్జీ ఇంగ్లాండ్, ఐర్లాండ్ క్రికెట్ జట్లతో ఆడటానికి ఇంగ్లాండ్ పర్యటన కోసం దక్షిణాఫ్రికా యొక్క ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు. [12]
2023 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఎంపికయ్యాడు. [13] అతను 2023 ఫిబ్రవరి 28 న వెస్టిండీస్‌పై తన తొలి మ్యాచ్ ఆడాడు [14] 2023 మార్చిలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టుకు ఎంపికయ్యాడు. [15] అతను 2023 మార్చి 18 న ఈస్టు లండన్‌లో జరిగిన సిరీస్‌లోని రెండవ వన్‌డేలో తన తొట్టతొలి వన్‌డే ఆడి, మూడు వికెట్లు తీసుకున్నాడు. [16]