జేమ్స్ బాండ్ | |
---|---|
దర్శకత్వం | సాయి కిషోర్ మచ్చ |
నిర్మాత | అనిల్ సుంకర |
తారాగణం | అల్లరి నరేష్ సాక్షి చౌదరి |
సంగీతం | సాయి కార్తీక్ |
నిర్మాణ సంస్థ | ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ |
పంపిణీదార్లు | ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 24 జూలై 2015 |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
జేమ్స్ బాండ్ 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం.సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహించాడు. ఏ.కే. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించాడు. అల్లరి నరేష్, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలను పోషించగా, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు, కృష్ణ భగవాన్ తదితరులు సహాయ పాత్రలను పోషించారు.[1][2]
లేడీ డాన్ బుల్లెట్ (సాక్షి చౌదరి) చిన్నప్పుడే విడిపోయిన తల్లిని కలుసుకుంటుంది. ఆ తర్వాత తన తల్లి కాన్సర్ తో భాధపడుతోందని తెలుసుకొని డాక్టర్ సూచన మేరకు, ఆమెను సంతోషంగా ఉంచితే త్వరగా రికవరీ అవుతుందనే విషయం తెలుస్తుంది. ఆ క్రమంలో తల్లి కోరికలు తీర్చాలని నిర్ణయించుకొని తల్లి దగ్గర తన ఐడెంటిటీ దాస్తుంది. ఇంతకీ ఆ తల్లి కోరిక ఏమిటంటే తన కూతురు వివాహం చూడటం. దాంతో బుల్లెట్ కు ఇష్టం లేకపోయినా తప్పని సరి పరిస్ధితుల్లో వరుడు వేట మొదలెడుతుంది. మరో ప్రక్క నాని(అల్లరి నరేష్) సాప్ట్ గా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీరు. ఓ సారి తన తల్లితో సంప్రదాయ బద్దంగా తయారై గుళ్లోకి వచ్చిన బుల్లెట్ ని చూసి మనసుపారేసుకుంటాడు. ఆమె కోసం వెతికే క్రమంలో ఆమెకూడా పెళ్లి కొడుకు కోసం వెతుకుతోందని ఓ మ్యారేజ్ బ్యూరో ఓనర్ (కృష్ణ భగవాన్) ద్వారా తెలుసుకుని ఓ అడుగు ముందుకేసి,ఆమెతో ఏడు అడుగులు నడుస్తాడు. ఆ తర్వాత కొంత కాలానికి అతనికి తను పెళ్లి చేసుకున్నది కత్తిలాంటి అమ్మాయిని కాదని కత్తిని అని తెలుసుకుంటాడు. అప్పుడేం అయ్యింది. తెలిసిన నాని ఏం చేసాడు. మరో ప్రక్క బుల్లెట్ ని చంపాలని తిరుగుతున్న ఆమె ప్రత్యర్ది (ఆశిష్ విద్యార్థి) సంగతేంటి అనేది మిగిలిన కథ.