జై సింహా | |
---|---|
![]() చలనచిత్ర పోస్టర్ | |
దర్శకత్వం | కె.ఎస్.రవికుమార్ |
రచన | ఎం.రత్న్ం (కథ/సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | కె.ఎస్.రవికుమార్ |
నిర్మాత | సి.కళ్యాణ్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ నయనతార నటాషా దోషి హరిప్రియ |
ఛాయాగ్రహణం | సి. రామ్‌ప్రసాద్ |
కూర్పు | ప్రవీణ్ అంటోనీ |
సంగీతం | చిరంతన్ భట్ట్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 12 జనవరి 2018 |
సినిమా నిడివి | 164 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹30 crore (US$3.8 million)[2] |
బాక్సాఫీసు | 50 కోట్లు [3] |
జైసింహా 2018 జనవరి 18న విడుదలైన తెలుగు చిత్రం. చిల్లర కళ్యాణ్ నిర్మాత.[4]
విశాఖపట్నం లోని ఒక ఆసుపత్రిలో గౌరి(నయనతార), ఆమె తండ్రి(ప్రకాష్ రాజ్)ను చూపించడంతో కథ మొదలవుతుంది. తదుపరి సన్నివేశంలో నరసింహ(బాలకృష్ణ) తన చిన్న బిడ్డతో కూర్గ్, కేరళ ప్రాంతాలకు వెళతాడు. అక్కడ తన బిడ్డకు సరిపడే వాతావరణం లేదని తెలుసుకుని చివరకు తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ వెంకటేశ్వర స్వామి ప్రధాన ధర్మకర్త (మురళీమోహన్) పరిచయం అవుతాడు. ఆయన ఇంట్లోకి పనికి కుదురుకుంటాడు. ఆలయ ఆర్చకులకు, పోలీసులకు జరిగిన గొడవల్లో నరసింహం చొరవ తీసుకుని, జిల్లా ఎస్.పితో అర్చకులకు క్షమాపణ చెప్పిస్తాడు. దాంతో ఎస్.పి..నరసింహంపై పగ పెంచుకుంటాడు.
కుంభకోణంలోనే పెద్ద రౌడీ అయిన కనియప్పన్ తమ్ముడిని చంపి, ఆ హత్యను నరసింహంపై మోపే ప్రయత్నం చేస్తాడు ఎస్.పి. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఉరిశిక్ష పడిన ఖైదీ(అశుతోష్ రాణా)..నరసింహంను చంపాలనుకుంటుంటాడు. అందుకని మంచి అదునుకోసం ఎదురు చూస్తుంటాడు. ఆ సమయంలో నరసింహంకు ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. అసలు ఎస్.పికి, నరసింహానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు గౌరి ఎవరు? గౌరికి, నరసింహంకు ఉన్న బంధం ఏంటి? వైజాగ్‌కు, నరసింహంకు ఎలాంటి అనుబంధం ఉంటుంది? అసలు నరసింహం తన కొడుకుతో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఎందుకు వెళుతుంటాడు? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.