జ్యోతిస్వరూపిణి రాగముకర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 68వ మేళకర్త రాగము.[1][2] ఇది 32వ మేళకార్త రాగం రాగవర్ధిని రాగం ప్రతిమధ్యంతో సమానంగా ఉంటుంది. [3] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "జ్యోతిరాగం" లేదా "జోటి"[3][4] లేదా జ్యోతి[5] అని పిలుస్తారు.
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R3 G3 M2 P D1 N2 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N2 D1 P M2 G3 R3 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : షట్శృతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 32వ మేళకర్త రాగమైన రాగవర్ధిని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.