ఝంకారధ్వని రాగం కర్ణాటక సంగీతంలో ఒకరాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాలలో 19వ రాగం. ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "ఝంకారభ్రమరి" రాగం అంటారు.[1][2][3]
ఈ రాగంలోని స్వరాలుచతుశ్రుతి ఋషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ధైవతము, శుద్ధ నిషాధము. ఇది 55వ మేళకర్త శ్యామలాంగి రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.