ఝాన్సీ | |
---|---|
దర్శకత్వం | బాలా |
నిర్మాత | కోనేరు కల్పన |
తారాగణం | జ్యోతిక, జీవి ప్రకాష్ కుమార్, ఇవానా, రాక్‌లైన్ వెంకటేష్ |
ఛాయాగ్రహణం | తేని ఈశ్వర్ |
సంగీతం | ఇళయరాజా |
విడుదల తేదీ | 17 ఆగష్టు 2018 [1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఝాన్సీ 2018లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2018లో నాచియార్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ఝాన్సీ పేరుతో డబ్బింగ్ చేసి ఆగస్టు 17న విడుదల చేశారు. కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్ బ్యానర్‌లపై కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు బాల దర్శకత్వం వహించగా జ్యోతిక, జీవి ప్రకాష్ కుమార్, ఇవానా, రాక్‌లైన్ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు.[2]
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఝాన్సీ (జ్యోతిక) ఓ మైనర్ అయిన రాశి (ఇవానా) రేప్ కేసును టెక్ అప్ చేస్తుంది. ఆ కేసులో రాశి ప్రియుడు గాలి రాజు (జీ వి ప్రకాష్) ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతుంది. ఝాన్సీ మైనర్ రేప్ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అయితే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఝాన్సీకి ఎన్నో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. చివరికీ ఈ కేసు మిస్టరీని ఝాన్సీ ఎలా ఛేదించి నిందుతుడికి ఎలాంటి శిక్ష వేసింది అనేది మిగతా సినిమా కథ.[3]