ఝాలవరాళి రాగము కర్ణాటక సంగీతంలో 39వ మేళకర్త రాగము.[1][2]
ఈ రాగంలోని స్వరాలు : శుద్ధ ఋషభము, శుద్ధ గాంధారము, ప్రతి మధ్యమము, శుద్ధ ధైవతము, కాకళి నిషాధము. ఇదొక ఆరోహణ, అవరోహణ లలో సప్తస్వరాలు కలిగిన సంపూర్ణ రాగము. ఇది 3 వ మేళకర్త రాగమైన గానమూర్తి కి సమానమైన ప్రతి మధ్యమ రాగము.
ఈ రాగం యొక్క ముఖ్యమైన జన్య రాగము వరాళి రాగము. ఇది ఘన పంచక రాగాలలో ఆఖరుది. రాగ విస్తారానికి బాగా అనుకూలమైన రాగం. కరుణరస ప్రధాన రాగం. ఈ రాగం లోని మధ్యమం మామూలు ప్రతిమధ్యమం కన్న కొంచెం ఎక్కువగా పలుకుతారు. అందుకే ఈ స్వరాన్ని “వరాళి మధ్యమం” అని పిలుస్తారు.