వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | థామస్ విలియం మాక్స్‌వెల్ లాథమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | క్రైస్ట్‌చర్చ్, కాంటర్బరీ, న్యూజీలాండ్ | 1992 ఏప్రిల్ 2|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.73 మీ. (5 అ. 8 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్-batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Rod Latham (father) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 263) | 2014 ఫిబ్రవరి 14 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 17 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 170) | 2012 ఫిబ్రవరి 3 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 8 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 48 (previously 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 55) | 2012 జూన్ 30 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఏప్రిల్ 17 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 48 (previously 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11–present | కాంటర్బరీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Scotland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | కెంట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018 | డర్హమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 07 May 2023 |
థామస్ విలియం మాక్స్‌వెల్ లాథమ్ (జననం 1992 ఏప్రిల్ 2) న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెటరు, వన్డే ఇంటర్నేషనల్‌లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కెప్టెన్, టెస్టు మ్యాచ్‌లలో వైస్ కెప్టెన్. టెస్టుల్లో న్యూజిలాండ్ ఓపెనర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు. లాథమ్ 2019–2021 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్ జట్టులో సభ్యుడు. అతను మాజీ క్రికెటర్ రాడ్ లాథమ్ కుమారుడు.
అతను ప్రధానంగా బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్‌గా కూడా ఆడేవాడు. కాంటర్‌బరీ తరపున ఆడుతూ, 2010లో ప్లంకెట్ షీల్డ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లకు వ్యతిరేకంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో రంగప్రవేశం చేశాడు. 2012లో జింబాబ్వేతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ సిరీస్‌కు ఎంపికై,[1] 2012 ఫిబ్రవరి 3న తన తొలి వన్‌డే ఆడాడు.[2] 2014 ఫిబ్రవరిలో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రంగప్రవేశం చేశాడు.
లాథమ్ 2010-11 ప్లంకెట్ షీల్డ్ సీజన్‌లో కాంటర్‌బరీ తరపున తొలి ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడి, 65 పరుగులు చేశాడు. [3] [4] కాంటర్‌బరీ తరపున యూత్ క్రికెట్ ఆడాడు, అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2008-09 సీజన్ నుండి కాంటర్‌బరీ A జట్టు కోసం ఆడాడు. [5] [6] 2010లో లాథమ్ ఇంగ్లండ్‌లోని డర్హామ్ కౌంటీ క్రికెట్ క్లబ్ అకాడమీలో సభ్యుడు. అతను డర్హామ్ సెకండ్ XI, నార్తంబర్‌ల్యాండ్ డెవలప్‌మెంట్ XI ల తరఫున మ్యాచ్‌లు ఆడాడు. అలాగే గేట్స్‌హెడ్ ఫెల్ కోసం ఇంగ్లాండ్‌లోని నార్త్ ఈస్టు ప్రీమియర్ లీగ్‌లో క్లబ్ క్రికెట్ ఆడాడు. [6] [7] [8] [9]
లాథమ్ కాంటర్‌బరీ కోసం అన్ని ఫార్మాట్‌లలో కనిపించాడు. అతను 2013 ఇంగ్లీష్ వేసవిని మళ్లీ ఈశాన్య ఇంగ్లాండ్‌లో ఆడాడు. నార్త్ ఈస్టు ప్రీమియర్ లీగ్‌లో సౌత్ షీల్డ్స్, 2013లో ప్రధాన ఇంగ్లీష్ లిస్టు A పోటీ అయిన 2013 యార్క్‌షైర్ బ్యాంక్ 40 పోటీలో స్కాట్‌లాండ్ కోసం ఆడాడు. అలాగే డర్హామ్ సెకండ్ XI కోసం మరో రెండు మ్యాచ్‌లు ఆడాడు.[7] [10] [11] [12] [13] అతను వేసవిలో [14] [15] పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ టెస్టు జట్టుకు, T20 జట్టుకు ఎంపికయ్యాడు. పర్యటనలో రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడాడు. [16] [17]
కెంట్ 2016 ఇంగ్లీష్ సీజన్ కోసం లాథమ్‌ను విదేశీ ఆటగాడిగా తీసుకుంది. [18] అతను మేలో కాంటర్‌బరీలో గ్లామోర్గాన్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో రంగప్రవేశం చేసి, రెండు ఇన్నింగ్స్‌లలో హాఫ్ సెంచరీలు సాధించాడు, రంగప్రవేశంలోనే అలా చేసిన చరిత్రలో మొదటి కెంట్ బ్యాటరతను. [19] [20] కౌంటీ కోసం ఆట యొక్క మూడు ఫార్మాట్లలో ఆడిన తర్వాత, జూలై మధ్యలో కెంట్‌ను వీడి, జింబాబ్వేలో న్యూజిలాండ్ జట్టులో చేరాడు.[21]
2017లో లాథమ్ 2017 ఇంగ్లీష్ క్రికెట్ సీజన్ రెండవ భాగంలో డర్హామ్‌తో విదేశీ ఆటగాడిగా సంతకం చేశాడు. [22] 2023లో, కాంటర్‌బరీలో కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్రే కోసం సంతకం చేశాడు.
2012లో జింబాబ్వేతో జరిగిన వన్‌డే లో ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ లాథమ్ తొలి మ్యాచ్‌లో 24 పరుగులు చేశాడు. జూలై 30న వెస్టిండీస్‌పై తన ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు. సిరీస్‌లో 15, 19 పరుగులు చేశాడు. లాథమ్ ఆ పర్యటనలో వన్‌డే సిరీస్‌లో కూడా ఆడాడు. అతని అత్యధిక స్కోరు 32. అతను బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా తిరిగి తీసుకున్నారు. అక్కడ అతను బ్యాటింగ్ ప్రారంభించేటప్పుడు 43 పరుగుల చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. తరువాతి శ్రీలంక పర్యటనలో 68 బంతుల్లో 86 పరుగులు చేశాడు.
అతను 2014 ఫిబ్రవరిలో భారత్‌పై 29, 0 స్కోర్‌లతో తన టెస్టు మ్యాచ్‌లో రంగప్రవేశం చేశాడు. అతను జూన్‌లో న్యూజిలాండ్‌తో వెస్టిండీస్‌లో పర్యటించి, మూడు టెస్టులు, రెండు T20లలో ఆడాడు. అది అతని అత్యంత విజయవంతమైన టెస్టు సిరీస్. మూడు అర్ధ సెంచరీలతో మొత్తం 288 పరుగులు చేశాడు. టాప్ రన్ స్కోరర్‌ల సిరీస్ జాబితాలో సహచరుడు కేన్ విలియమ్సన్ తర్వాత రెండవ స్థానంలో నిలిచాడు. 2014 జూలై నాటికి అతను హమీష్ రూథర్‌ఫోర్డ్, పీటర్ ఫుల్టన్‌లకు పేలవమైన ఫామ్ తర్వాత ఓపెనర్‌గా నిలదొక్కుకున్నాడు. 2014 నవంబరు 11న 103 పరుగులు చేసి, తన మొదటి టెస్టు సెంచరీ అబుదాబిలో పాకిస్తాన్‌పై సాధించాడు.
టెస్టు మ్యాచ్‌లలో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఉన్నప్పటికీ, లాథమ్ 2015 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ల్యూక్ రోంచికి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. BJ వాట్లింగ్‌కు గాయం కావడంతో లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్‌కు కీపింగ్ చేసాడు. అతను కీపింగు చేయనపుడు, సాధారణంగా వికెట్‌కు దగ్గరగా లేదా స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తాడు.
లాథమ్, 2015లో జింబాబ్వే పర్యటనకు ఓపెనింగ్ బ్యాటరుగా ఎంపికయ్యాడు. సిరీస్‌లోని రెండవ వన్‌డే సమయంలో, అతను తన తొలి వన్‌డే సెంచరీని 110 పరుగులతో నాటౌట్‌గా నమోదు చేశాడు. ఇది మార్టిన్ గప్టిల్‌తో 236 పరుగుల అజేయమైన భాగస్వామ్యంలో భాగం. న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేసింది. 2015-16 ట్రాన్స్-టాస్మాన్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్టులో - మొట్టమొదటి డే-నైట్ టెస్టు మ్యాచ్ అది - లాథమ్ డే-నైట్ టెస్ట్‌లో యాభై పరుగులు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
2016 అక్టోబరులో, ధర్మశాలలో భారత్‌తో ఆడుతున్నప్పుడు లాథమ్, వన్‌డేలో ఇన్నింగ్సంతా బ్యాటింగు చేసిన పదవ బ్యాట్స్‌మన్‌గా మొదటి న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. [23]
2017 జనవరిలో లాథమ్, చాపెల్-హాడ్లీ సిరీస్‌కు న్యూజిలాండ్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. [24] ఆ సిరీస్‌లోని మొదటి వన్‌డేలో అతను వన్‌డే ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్‌గా ఐదు అవుట్లు చేసిన న్యూజిలాండ్ రికార్డును సమం చేశాడు. [25] అయినప్పటికీ, బ్యాట్‌తో పేలవమైన ఫామ్ కారణంగా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం మార్చి 1న అతన్ని తొలగించారు.
2017 మేలో లాథమ్‌ను తిరిగి జట్టు లోకి తీసుకున్నారు. అనేక మంది ఆటగాళ్ళు2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నందున ఐర్లాండ్, బంగ్లాదేశ్‌తో ఐర్లాండ్‌తో జరిగిన ఐర్లాండ్ ట్రై-సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [26]
2017 అక్టోబరులో, లాథమ్‌కు భారత్‌పై వికెట్ కీపింగ్ బాధ్యతలు ఇచ్చారు. స్పిన్‌కు వ్యతిరేకంగా ఆడగల అతని సామర్థ్యం కారణంగా అతన్ని బ్యాటింగు వరుసలో 5 వ స్థానంలో దింపారు. 3-మ్యాచ్‌ల సిరీస్‌లోని 1వ గేమ్‌లో 102 బంతుల్లో 103* పరుగులు చేశాడు. [27]
2017 డిసెంబరులో, కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలు విశ్రాంతి తీసుకోవడంతో వెస్టిండీస్‌పై తాత్కాలిక వన్‌డే కెప్టెన్‌గా లాథమ్ తన పాత్రను కొనసాగించాడు.
2018 మేలో, 2018–19 సీజన్‌కు కొత్త న్యూజిలాండ్ క్రికెట్ కాంట్రాక్ట్‌ను పొందిన ఇరవై మంది ఆటగాళ్లలో అతను ఒకడు. [28] 2018 డిసెంబరులో, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో, అతను టెస్టు క్రికెట్‌లో 264 నాటౌట్‌తో ఇన్నింగ్సంతా ఆడి అత్యధిక స్కోరు చేసాడు. [29] 2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [30] [31] 2019 జూలైలో, భారత్‌తో జరిగిన న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో, లాథమ్ న్యూజిలాండ్ తరపున తన 150వ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాడు. [32]
2020 జనవరిలో, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో, కేన్ విలియమ్సన్ ఫ్లూ కారణంగా మ్యాచ్‌కు దూరమైన తర్వాత, టెస్టు క్రికెట్‌లో మొదటిసారి న్యూజిలాండ్‌కు లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. [33] 2020 ఫిబ్రవరిలో, భారత్‌తో జరిగిన మొదటి, రెండవ వన్‌డేలో, భుజం గాయం కారణంగా కేన్ విలియమ్సన్ మ్యాచ్ నుండి వైదొలగడంతో లాథం కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. న్యూజిలాండ్ [34] ఆ రెండు మ్యాచ్‌లను 4 వికెట్లు, 22 పరుగుల తేడాతో గెలిచింది. [35]
2022 డిసెంబరులో, పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్టులో, లాథమ్ టెస్టు క్రికెట్‌లో తన 13వ సెంచరీ సాధించాడు. [36] అది, టెస్ట్‌లలో న్యూజిలాండ్ ఓపెనర్ చేసిన అత్యధిక సెంచరీల సంఖ్య. [37]
లాథమ్ టెస్టు క్రికెట్‌లో 13 సెంచరీలు, వన్డే ఇంటర్నేషనల్స్‌లో 7 సెంచరీలు చేశాడు. అతని అత్యధిక టెస్టు స్కోరు 264 నాటౌట్ 2018 డిసెంబరులో శ్రీలంకపై బేసిన్ రిజర్వ్‌లో చేసాడు. అతని అత్యధిక వన్‌డే స్కోరు 145 నాటౌట్ 2022 నవంబరులో ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో భారతదేశంపై చేసాడు.
నం. | స్కోర్ | వ్యతిరేకంగా | తేదీ | వేదిక | ఫలితం | Ref |
---|---|---|---|---|---|---|
1 | 103 | పాకిస్తాన్ | 2014 నవంబరు 9 | షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి | కోల్పోయిన | [39] |
2 | 137 | పాకిస్తాన్ | 2014 నవంబరు 17 | దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ | డ్రా | [40] |
3 | 109* | శ్రీలంక | 2015 డిసెంబరు 10 | యూనివర్శిటీ ఆఫ్ ఒటాగో ఓవల్, డునెడిన్ | గెలిచింది | [41] |
4 | 105 | జింబాబ్వే | 2016 జూలై 28 | క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో | గెలిచింది | [42] |
5 | 136 | జింబాబ్వే | 2016 ఆగస్టు 6 | క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో | గెలిచింది | [43] |
6 | 177 | బంగ్లాదేశ్ | 2017 జనవరి 12 | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ | గెలిచింది | [44] |
7 | 264* | శ్రీలంక | 2018 డిసెంబరు 15 | బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ | డ్రా | [45] |
8 | 176 | శ్రీలంక | 2018 డిసెంబరు 26 | హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ | గెలిచింది | [46] |
9 | 161 | బంగ్లాదేశ్ | 2019 ఫిబ్రవరి 28 | సెడాన్ పార్క్, హామిల్టన్ | గెలిచింది | [47] |
10 | 154 | శ్రీలంక | 2019 ఆగస్టు 22 | పైకియాసోతి శరవణముట్టు స్టేడియం, కొలంబో | గెలిచింది | [48] |
11 | 105 | ఇంగ్లాండు | 2019 నవంబరు 29 | సెడాన్ పార్క్, హామిల్టన్ | డ్రా | [49] |
12 | 252 | బంగ్లాదేశ్ | 2022 జనవరి 9 | హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ | గెలిచింది | [50] |
13 | 113 | పాకిస్తాన్ | 2022 డిసెంబరు 26 | నేషనల్ బ్యాంక్ క్రికెట్ అరేనా, కరాచీ | డ్రా | [51] |
నం. | స్కోర్ | వ్యతిరేకంగా | తేదీ | వేదిక | ఫలితం | Ref |
---|---|---|---|---|---|---|
1 | 110* | జింబాబ్వే | 2015 ఆగస్టు 4 | హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే | గెలిచింది | [53] |
2 | 137 | బంగ్లాదేశ్ | 2016 డిసెంబరు 26 | హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ | గెలిచింది | [54] |
3 | 104 | ఐర్లాండ్ | 2017 మే 21 | మలాహిడే క్రికెట్ క్లబ్ గ్రౌండ్, మలాహిడ్ | గెలిచింది | [55] |
4 | 103* | భారతదేశం | 2017 అక్టోబరు 22 | వాంఖడే స్టేడియం, ముంబై | గెలిచింది | [56] |
5 | 110* | బంగ్లాదేశ్ | 2021 మార్చి 23 | హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ | గెలిచింది | [57] |
6 | 140* | నెదర్లాండ్స్ | 2022 ఏప్రిల్ 2 | సెడాన్ పార్క్, హామిల్టన్ | గెలిచింది | [58] |
7 | 145* | భారతదేశం | 2022 నవంబరు 25 | ఈడెన్ పార్క్, ఆక్లాండ్ | గెలిచింది | [59] |