తిరువెంకట రాజేంద్ర శేషాద్రి (FNA, FRS) ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త, విద్యావేత్త, రచయిత. ఈయన భారతీయ ఔషధ, ఇతర మొక్కలపై పరిశోధనలకు ప్రసిద్ధి చెందారు. భారతదేశంలో ఆర్గానిక్ కెమిస్ట్రీని అభివృద్ధి చేశారు. 1963లో, సైన్స్‌కు ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం అతనికి పద్మ భూషణ్ ప్రదానం చేసింది.[1] ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1942), ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ (1960), ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (1967-1968) అధ్యక్షుడిగా పనిచేశారు. సుమారు 1200 ప్రచురణల రచయిత లేదా సహ రచయిత.
రాజేంద్ర శేషాద్రి 1900 ఫిబ్రవరి 8వ తేదిన తమిళనాడులోని కురిటలైలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. తన గ్రామంలోని స్థానిక పాఠశాలలో ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించిన తరువాత, ఉన్నత పాఠశాల విద్యను దేవాలయ పట్టణం శ్రీరంగంలో, నేషనల్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్, తిరుచిరాపల్లిలో చదివాడు. తరువాత మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు.1917లో తన గ్రాడ్యుయేట్ స్టడీస్ (BSc ఆనర్స్) కోసం రామకృష్ణ మిషన్ ఆర్థిక సహాయంతో 1920లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ తర్వాత, అతను మిషన్‌లో ఒక సంవత్సరం పనిచేశాడు, కానీ తన మాస్టర్స్ డిగ్రీ కోసం ప్రెసిడెన్సీ కాలేజీలో తన చదువును కొనసాగించాడు. తర్వాత 1927 లో పెద్ద చదువుల కోసం ఈయన మాంచెస్టర్ విశ్వ విద్యాలయమునకు వెళ్ళాడు. అందులో ఉన్నత చదువుల కోసం 1927లో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉపకారవేతనం పొందాడు. అక్కడ అతను ప్రఖ్యాత బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత మార్గదర్శకత్వంలో డాక్టరల్ పరిశోధన చేసి 1929లో PhD పొందారు. ఎన్నో వందల రకాల వృక్ష జాతుల పై పరిశోధనలు చేశారు. దీని వలన క్రొత్త రసాయన సంయోగ పదార్థాలు కనుగొనబడ్డాయి. ఇతను 75 సంవత్సరాల వయస్సులో, 1975 సెప్టెంబరు 27న మరణించాడు.[2]
1930లో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులోని ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో మద్రాస్ విశ్వవిద్యాలయంలో పరిశోధనా స్కాలర్‌గా మొక్కల రసాయన శాస్త్రంపై తన పనిని కొనసాగించాడు. 1934లో ఆంధ్రా యూనివర్శిటీలో రీడర్ గా రసాయన శాస్త్ర విభాగాధిపతిగా అనేక ప్రయోగశాలలు, రెండు కొత్త విభాగాలు, పరిశోధనా పాఠశాల స్థాపనలో కీలకపాత్ర పోషించాడు. ఆ విశ్వవిద్యాలయంలో 15 సంవత్సరాలు సేవలందించాడు. అక్కడ తన పదవీకాలంలో, అతను తన స్వంత పరిశోధనలను కొనసాగిస్తూనే, ఫ్లేవనాయిడ్స్‌పై అనేక ప్రయోగశాలలు, పరిశోధన పాఠశాలను స్థాపించాడు. అతను విశ్వవిద్యాలయంలో రెండు కొత్త విభాగాలను కూడా స్థాపించాడు, అవి డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. అతను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మరొక పరిశోధనా పాఠశాలను స్థాపించాడు, ఇది అనతి కాలంలోనే రసాయన పరిశోధనలో అత్యుత్తమ కేంద్రంగా మారింది. సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఫర్ ది కెమిస్ట్రీ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్ పేరుతో అతను1975 వరకు అధిపతిగా పనిచేశాడు. ప్లాంట్ కెమిస్ట్రీపై మార్గదర్శక పరిశోధన, ప్రధానంగా ఆక్సిజన్ హెటెరోసైక్లిక్‌లలో, ఫ్లేవనాయిడ్ పిగ్మెంట్ల యొక్క ఐసోలేషన్, నిర్మాణ విశదీకరణకు దోహదపడింది. ఈయన గంధపు చెట్లపై, చారిత్రాత్మక కట్టడాలపై రసాయన పదార్థాల ప్రభావాన్ని అధ్యయనం చేశాడు