వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | తిరుమలై అనంతన్‌పిళ్ళై శేఖర్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 28 March 1956 చెన్నై | (age 68)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right-arm medium | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 163) | 1983 జనవరి 23 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1983 జనవరి 30 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 44) | 1983 జనవరి 21 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1985 జనవరి 27 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2005 సెప్టెంబరు 10 |
తిరుమలై అనంతన్‌పిళ్లై శేఖర్ (1956 మార్చి 28) టెస్ట్ క్రికెట్, వన్ డే ఇంటర్నేషనల్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్.
ఎనభైల ప్రారంభంలో భారతదేశంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లలో శేఖర్ ఒకడు. అతను ఆడిన రెండు టెస్ట్ మ్యాచ్‌లు 1982-83 సీజన్‌లో గాయపడిన మదన్ లాల్ స్థానంలో పాకిస్తాన్ పర్యటనలో ఆడినవే. రెండు మ్యాచ్‌ల్లోనూ వికెట్ తీయలేదు. [1] అతను ఆ సిరీస్‌లో ఒక వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. రెండేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌తో మరో మూడు ఆడాడు.
శేఖర్ 1976/77, 1987/88 మధ్య తమిళనాడు తరపున 74 వికెట్లు తీశాడు. 1981/82లో కేరళపై 54 పరుగులకు 9 వికెట్లు తీసుకోవడం అతని కెరీర్ బెస్ట్ బౌలింగు. అతను గేమ్ నుండి రిటైరయ్యే ముందు మధ్యప్రదేశ్ తరపున రెండు సీజన్లు ఆడాడు.
రిటైరయినప్పటి నుండి భారత క్రికెట్‌కు అతని ప్రధాన సహకారం చెన్నైలోని MRF పేస్ ఫౌండేషన్‌లో బౌలింగ్ కోచ్‌గా పనిచెయ్యడం. అక్కడ అతను చాలా సంవత్సరాలు చీఫ్ కోచ్‌గా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పేస్ బౌలర్‌లతో కలిసి పనిచేశాడు. [2] జాతీయ సెలక్షన్ కమిటీలో సౌత్ జోన్ ప్రతినిధిగా కూడా కొంతకాలం పనిచేశాడు. తర్వాత అతను ముంబై ఇండియన్స్‌కు టాలెంట్ స్కౌట్‌గా నియమించబడ్డాడు. [2]