టి.కె.మూర్తి | |
---|---|
![]() భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారి చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను స్వీకరిస్తున్న టి.కె.మూర్తి | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | థాను కృష్ణమూర్తి |
జననం | 1922 ఆగస్టు 13 |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వాయిద్యాలు | మృదంగం, కొనక్కోల్ |
క్రియాశీల కాలం | 1934–ప్రస్తుతం |
వెబ్‌సైటు | T K Murthy |
టి.కె.మూర్తిగా పిలువబడే థాను కృష్ణమూర్తి ఒక కర్ణాటక సంగీత మృదంగ వాద్య కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
ఇతడు 1922 ఆగష్టు 13 వ తేదీన కేరళ రాష్ట్రంలోని నయతంగరై గ్రామంలో థాను భాగవతార్, అన్నపూర్ణి దంపతులకు జన్మించాడు. ఇతడు ఎటువంటి శిక్షణ లేకుండా తన 8వ ఏట మృదంగ వాద్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. తంజావూరు వైద్యనాథ అయ్యర్ ఒక కచేరీలో ఇతని మృదంగ వాద్యాన్ని విని ఆకర్షితుడై, మృదంగంలో మెరుగైన శిక్షణ ఇవ్వడానికి ఇతడిని తనతో పాటు తంజావూరు తీసుకువెళ్ళాడు. ఇతడు వైద్యనాథ అయ్యర్ వద్ద పాల్గాట్ మణి అయ్యర్, తంబుస్వామిలతో కలిసి మృదంగం నేర్చుకున్నాడు.[1]
ఇతని పూర్వీకులు అందరూ ఆస్థాన సంగీత విద్వాంసులు. ఇతడు ఐదవ తరానికి చెందిన సంగీత విద్వాంసుడు. ఇతనికి కుమారుడు టి.కె.జయరామన్ ఆకాశవాణిలో సంగీత స్వరకర్త, మనుమడు కార్తికేయ మూర్తి సినిమా సంగీత దర్శకుడు.[2][3]
మూర్తి తన 11వ యేట కోయంబత్తూరులో ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ గాత్ర సంగీత కచేరీలో మొట్టమొదట నైపుణ్యం కలిగిన మృదంగ విద్వాంసునిగా తన ప్రదర్శన ఇచ్చాడు. ఇతడు 15000లకు పైగా కచేరీలలో మృదంగ సహకారం అందించాడు. ఇతడు 80 సంవత్సరాలకు పైగా అనేక తరాల సంగీత విద్వాంసులతో కలిసి కచేరీలు చేశాడు.[1] ఇతడు మృదంగ సహకారం అందించిన వారిలో హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, మదురై ఎస్.సోమసుందరం, డి.కె.జయరామన్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కున్నక్కూడి వైద్యనాథన్, లాల్గుడి జయరామన్, టి.వి.శంకరనారాయణన్, మాండొలిన్ శ్రీనివాస్ వంటి వారు ఉన్నారు. మృదంగంలో ఇతని శైలి తంజావూరు బాణీకి చెందినప్పటికీ ఇతడు పళని సుబ్రహ్మణ్యం పిళ్ళైకి చెందిన పుదుక్కోటై శైలి పట్ల ఆకర్షితుడయ్యాడు. తంజావూరు శైలినీ, పుదుక్కోటై శైలినీ మిశ్రమం చేసి ఇతడు తనదైన ప్రత్యేకమైన మృదంగ శైలిని అలవరచుకున్నాడు.
ఇతడికి అనేక పురస్కారాలు, సన్మానాలు లభించాయి. వాటిలో కొన్ని:
ఇతడు త్రివేండ్రం ప్యాలెస్‌లో ఆస్థాన విద్వాంసుడిగా ఉన్నాడు. ప్రసార భారతి ఇతడికి "జాతీయ కళాకారుడి"గా గుర్తించింది.