![]() | |
దేశం | భారతదేశం |
---|---|
కేంద్రకార్యాలయం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
ప్రసారాంశాలు | |
భాష(లు) | తెలుగు |
చరిత్ర | |
ప్రారంభం | ఏప్రిల్ 2011 |
లభ్యత | |
టి.న్యూస్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన టెలివిజన్ వార్తా ఛానల్. ఈ ఛానల్ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినది. ఈ ఛానల్ ద్వారా వార్తలు, సంఘటనలు, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన విషయాలు ప్రసారమవుతాయి. ఈ ఛానల్ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, వరిత్రను ప్రతిబింబిస్తుంది. ఈ ఛానల్ నినాదం " తెలంగాణ గుండె చప్పుడు". ఈ ఛానల్ లో ఉర్దూ వార్తా బులెటిన్ లు కూడా ప్రసారమవుతాయి. ఇది తెలంగాణ లోని హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తుంది. అప్పుడప్పుడూ ఉర్దూ వార్తలను కూడా ప్రసారం చేస్తుంది. ఇందులో బ్రేకింగ్ న్యూస్, లైవ్ రిపోర్టులు, ఇంటర్వ్యూలు, రాజకీయ చర్చలు, క్రీడలు, వాతావరణం, వినోద కార్యక్రమాలు, వ్యాపార విషయాలు, కరంట్ అఫైర్స్ లు ప్రసారితమవుతాయి.
ఈ చానల్ ను తెలంగాణ టెలివిజన్ నెట్ వర్క్స్ అయిన టాటా స్కై, వీడియాకాన్ డి.టి.హెచ్, రిలయన్స్ డిజిటల్ టి.వి. ఎయిర్ టెల్ డిజిటల్ టి.వి. డిష్ టి.వి, సన్ డైరక్ట్ లు ప్రసారం చేస్తున్నాయి. ఈ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలను దాని అంతర్జాల వెబ్సైట్, యూట్యూబ్ లలో కూడా ప్రసారం చేస్తుంది.
ఈ ఛానల్ రాజ్ న్యూస్ తో కలసి మొదట పనిచేసింది. 2011 ఏప్రిల్ 4 న ఉగాది రోజున టి.న్యూస్ ఛానల్ గా స్వతంత్ర ఛానల్ గా ప్రారంభించబడినది. [1]