వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | పార్ల్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా[1] | 1990 మే 17|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటింగ్ (క్రికెట్) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 320) | 2014 డిసెంబరు 26 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 మార్చి 8 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 117) | 2016 సెప్టెంబరు 25 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 83) | 2019 సెప్టెంబరు 18 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 3 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008/09–present | Gauteng | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008/09–2016/17 | ఇంపీరియల్ లయన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18 | కేప్ కోబ్రాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018/19–2020/21 | ఇంపీరియల్ లయన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | డర్బన్ హీట్ (స్క్వాడ్ నం. 11) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | నార్తాంప్టన్‌షైర్ (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | జోజి స్టార్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Sunrisers Eastern Cape | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2 ఏప్రిల్ 2023 |
టెంబా బావుమా (జననం 1990 మే 17) దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెటరు, అతను టెస్టులు, వన్‌డేల్లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ప్రస్తుత కెప్టెన్. గతంలో T20I కి కెప్టెన్‌గా చేసాడు. అతను కుడిచేతి వాటం బ్యాటరు. దక్షిణాఫ్రికా తరపున టెస్టు సెంచరీ చేసిన మొదటి నల్లజాతి క్రికెటరు. జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మొదటి ఆటగాడు. [2] [3] 2016 సెప్టెంబరులో ఐర్లాండ్‌పై 113 పరుగులతో తొలి వన్డే లోనే శతకం చేసిన ముగ్గురు దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ఒకడు.[4]
బావుమా, థమీ త్సోలేకిలే, మలుసి సిబోటో వీళ్ళందరూ ఒకే వీధికి చెందినవారు. లంగా ప్రాంతంలో ఉండే తీవ్రమైన క్రికెట్ సంస్కృతిలో వాళ్ళు పెరిగారు. బావుమా, న్యూలాండ్స్‌లోని సౌత్ ఆఫ్రికన్ కాలేజీ జూనియర్ స్కూల్ [5] లోను, శాండ్‌టన్‌లోని, సెయింట్ డేవిడ్ మారిస్టు ఇనాండా అనే బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు.
బావుమా, 2008లో తూర్పు ప్రావిన్స్‌పై గౌటెంగ్‌లో రంగప్రవేశం చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ, అతను బ్యాటింగ్ చేసిన మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసాడు. ఫస్ట్‌క్లాస్ పోటీల్లో అత్యుత్తమ స్కోరు చేసిన తన సహచరుడు డేన్ విలాస్ తో కలిసి కాసేపు భాగస్వామ్యం పంచుకున్నాడు.
బావుమా 2010/11 సీజన్‌లో లయన్స్ తరపున తన ఫ్రాంచైజీ రంగప్రవేశం చేశాడు. సూపర్‌స్పోర్ట్ సిరీస్‌లో, అతను ఈ మొదటి సీజన్‌లో 60.50 సగటుతో 4 మ్యాచ్‌ల్లో 242 పరుగులు చేశాడు. ఇందులో నైట్స్‌పై చేసిన 124 నాటౌట్ స్కోరు కూడా ఉంది. అందులో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. [6] [7] 2011/12లో అతని రెండవ సూపర్‌స్పోర్ట్ సీజన్‌లో, అతను 53.08 సగటుతో 637 పరుగులు చేశాడు. ఇది అతన్ని టాప్ రన్ స్కోరర్లలో 11వ స్థానానికి చేర్చింది. [8] 2012/13లో, ఇప్పుడు పేరు మారిన సన్‌ఫోయిల్ సిరీస్‌లో అతను 5వ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు గానీ, సగటు 31.58 మాత్రమే ఉంది. [9] 2013/14లో, అతను మళ్లీ 39.66 సగటుతో 714 పరుగులు చేసి సన్‌ఫోయిల్ సిరీస్ స్కోరర్‌ల జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు. [10] అతని ఫ్రాంచైజీ కోసం, అతను సూపర్‌స్పోర్ట్, సన్‌ఫోయిల్ సిరీస్ క్రికెట్‌లో ఆరు 100లు, ఐదు 50లు చేసి, 50 లను 100 లుగా మార్చుకునే అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు.
ఈ ప్రదర్శనలు అతనికి దక్షిణాఫ్రికా A క్రికెట్ జట్టు కోసం ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లను సంపాదించిపెట్టాయి. మొదటిది 2012 జూలైలో శ్రీలంక Aతో డర్బన్‌లో జరిగింది. [11] అతను ఆ సంవత్సరం ఆగస్టులో A జట్టు ఐర్లాండ్ దేశ పర్యటనలో ఐర్లాండ్‌తో ఒక మ్యాచ్ కూడా ఆడాడు. [12] ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ అతను చెప్పుకోదగ్గ సహకారం అందించలేదు. A వైపు అతని తదుపరి ప్రదర్శనలు దక్షిణాఫ్రికా A తో, భారత ఆస్ట్రేలియా A జట్ల మధ్య దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్‌ల సిరీస్‌లో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఒకసారి, భారత్‌తో రెండుసార్లు తలపడ్డాడు. [13] [14] [15] ఇండియన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేయడం అతని అత్యుత్తమ ప్రదర్శన. 2015 ఆఫ్రికా T20 కప్ కోసం అతన్ని గౌటెంగ్ జట్టులోకి తీసుకున్నారు.[16]
2017 మేలో, 2017–18 సీజన్‌కు ముందు కేప్ కోబ్రాస్‌లో చేరేందుకు ఫ్రాంచైజీలను మారుతున్నట్లు బావుమా ప్రకటించాడు. [17] 2018 జూన్లో, బావుమా అన్ని ఫార్మాట్లలో హైవెల్డ్ లయన్స్‌కు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. [18] 2018 సెప్టెంబరులో, అతను 2018 ఆఫ్రికా T20 కప్ కోసం గౌటెంగ్ జట్టుకు ఎంపికయ్యాడు. [19] మరుసటి నెలలో, అతను ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంట్ మొదటి ఎడిషన్ కోసం డర్బన్ హీట్ జట్టులో ఎంపికయ్యాడు. [20] [21] 2019 సెప్టెంబరులో, అతను 2019 ఎంజాన్సీ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం జోజి స్టార్స్ జట్టు కోసం జట్టుకు ఎంపికయ్యాడు. [22] 2021 ఏప్రిల్లో, అతను దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు గౌటెంగ్ జట్టులో చేరాడు. [23]
2022 సెప్టెంబరులో, SA20 లీగ్ మొదటి ఎడిషన్ వేలంలో బావుమాను ఏ ఫ్రాంచైజీ ఎంపిక చేయలేదు. [24]
2023 SA20 లీగ్‌కు ముందు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ అతన్ని ఎంపిక చేసింది. [25]
2014 డిసెంబరు 26న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తరపున బావుమా తన రంగప్రవేశం చేశాడు [26]
2016 జనవరి 5న, దక్షిణాఫ్రికా తరఫున టెస్టు సెంచరీ సాధించిన మొదటి నల్లజాతి క్రికెటర్‌గా బావుమా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన 2015/16 సిరీస్‌లో 2వ టెస్టులో కేప్‌టౌన్‌లో అతను అజేయంగా 102 పరుగులు చేశాడు. [27]
బావుమా 2016 సెప్టెంబరు 25న ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా తరపున వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం చేసి, అతని తొలి వన్‌డే సెంచరీని సాధించాడు. తన బిడ్డ పుట్టుకకు హాజరైన హషీమ్ ఆమ్లా స్థానంలో, బావుమా క్వింటన్ డి కాక్‌తో కలిసి బ్యాటింగు ఓపెనింగు చేసాడు. బావుమా ఆ మ్యాచ్‌లో ప్రదర్శనకు గాను, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా తరపున వన్‌డేల్లో రంగప్రవేశంలోనే శతకం చేసిన రెండవ ఆటగాడు.[28][29]
బావుమా 2016 నవంబరు 7న ఆస్ట్రేలియాపై తన మొదటి, ఏకైక టెస్టు వికెట్ తీసుకున్నాడు.[30]
2017 మేలో క్రికెట్ దక్షిణాఫ్రికా వార్షిక అవార్డులలో బావుమా అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ గెలుచుకున్నాడు.[31]
2019 ఆగస్టులో బావుమా, భారత్‌తో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు.[32] 2019 సెప్టెంబరు 18న భారతదేశంపై దక్షిణాఫ్రికా తరపున తన తొలి T20I ఆడాడు.[33]
2021 మార్చి 4న, క్వింటన్ డి కాక్ నుండి కెప్టెన్సీని స్వీకరించిన బావుమా దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[34] అతనిని దక్షిణాఫ్రికా శాశ్వత కెప్టెన్‌గా నియమించడంతో, దక్షిణాఫ్రికా జట్టుకు శాశ్వత కెప్టెన్‌గా నియమితులైన మొట్టమొదటి నల్లజాతి ఆటగాడు అయ్యాడు.[35] [36] పాకిస్థాన్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్, బావుమాకు కెప్టెన్‌గా మొదటిది.[37] అతను మూడవ వన్‌డేలో స్నాయువు గాయంతో, సిరీస్‌లోని T20I భాగాన్ని కోల్పోయాడు.[38]
2021 జూలై 24న, ఐర్లాండ్‌తో జరిగిన మూడో T20Iలో, బావూమా తన తొలి T20I అర్ధ శతకం సాధించాడు. బారీ మెక్‌కార్తీకి ఔట్ అయ్యే ముందు 51 బంతుల్లో 72 పరుగులు చేశాడు. [39] [40] సెప్టెంబరులో, దక్షిణాఫ్రికా మూడు వన్‌డేలు, మూడు T20Iల కోసం శ్రీలంకలో పర్యటించింది; ఓపెనింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని కుడి బొటన వేలికి గాయమై, రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. [41] గాయానికి శస్త్రచికిత్స అవసరమైంది. కోలుకున్నాక, అక్టోబరులో 2021 ICC పురుషుల T20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు.[42] దక్షిణాఫ్రికా తమ ఐదు మ్యాచ్‌లలో నాలుగు గెలిచింది కానీ నెట్ రన్ రేట్ ఆధారంగా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. [43]
ఐదు టీ20ల కోసం 2022 జూన్‌లో దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించింది. దక్షిణాఫ్రికా ఆ సిరీస్‌ను డ్రా చేసుకుంది, కానీ బావుమా నాల్గవ మ్యాచ్‌లో మోచేయికి గాయం కావడంతో ఆ సంవత్సరం చివర్లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ పర్యటనకు దూరమయ్యాడు. [44] 2022 అక్టోబరు నవంబరులలో, 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌కు నాయకత్వం వహిస్తున్నప్పుడు, విస్డెన్ కోసం వ్రాస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్టు కాత్యా విట్నీ, బావుమా ఫామ్‌లో లేడని గమనించింది. "బావుమా జట్టు లోకి తీసుకు వచ్చేది తన బ్యాటింగ్ గణాంకాలపై మాత్రమే పూర్తిగా ఆధారపడేది కాకూడదని ఆమె సూచించింది. కెప్టెన్‌గా అతని నైపుణ్యాలను, అతని పాత్రనూ తేలికగా విస్మరించకూడదు." [45] ఆ సంవత్సరం T20 ప్రపంచ కప్‌కు ముందు జరిగిన రెండవ భారత పర్యటనలో, బావుమా T20Iలు, వన్‌డేలలో నాలుగు ఇన్నింగ్స్‌లలో ఎనిమిది పరుగులు చేశాడు, అనారోగ్యం కారణంగా పర్యటనలో అంతరాయం ఏర్పడింది, బావుమా చివరి రెండు వన్‌డేలకు దూరమయ్యాడు. [46] 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో బావుమా దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహించాడు. [47]
2023 మార్చి 18న, వెస్టిండీస్‌తో జరిగిన రెండవ వన్‌డే లో, అతను 118 బంతుల్లో 144 పరుగులు - తన కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు- సాధించాడు.[48] వన్‌డేలలో 1000 పరుగుల మార్కును అధిగమించాడు.[49]
అంతర్జాతీయ కెప్టెన్సీ రికార్డు | |||||||
---|---|---|---|---|---|---|---|
ఫార్మాట్ | మ్యాచ్‌లు | గెలిచింది | కోల్పోయిన | టైడ్ | NR | గెలుపు % | కాలం |
వన్‌డే | 17 | 9 | 7 | 0 | 1 | 56.25 | 2021–2023 |
T20I | 25 | 15 | 9 | 0 | 1 | 62.50 | 2021–2022 |
చివరిగా నవీకరించబడింది: 2023 ఫిబ్రవరి 4 [50] [51] |
{{cite web}}
: CS1 maint: url-status (link)