టెడ్డీ | |
---|---|
దర్శకత్వం | శక్తి సౌందర్ రాజన్ |
రచన | శక్తి సౌందర్ రాజన్ |
నిర్మాత | జ్ఞానవేల్ రాజా |
తారాగణం | ఆర్య సాయేషా సైగల్ సతీష్ |
ఛాయాగ్రహణం | ఎస్.యువ |
కూర్పు | టి. శివానందీశ్వరన్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | స్టూడియోగ్రీన్ |
పంపిణీదార్లు | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్స్ |
విడుదల తేదీ | 12 మార్చి 2021 |
సినిమా నిడివి | 136 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
టెడ్డీ 2021లో విడుదలైన తెలుగు సినిమా. స్టూడియోగ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించాడు. ఆర్య, సాయేషా సైగల్, సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను 2019 డిసెంబర్ 11న[1], ట్రైలర్‌ను ఫిబ్రవరి 21న విడుదల చేసి సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్స్ ఓటీటీలో మార్చి 12న విడుదల చేశారు.[2]
శ్రీ విద్య (సాయేషా) కాలేజీ స్టూడెంట్ ప్రమాదానికి గురై హాస్పిటల్‌లో చేరుతుంది. హాస్పిటల్‌లో వైద్యులు ప్రమాదకరమైన డ్రగ్స్ ఇచ్చి ఆమెను కోమాలోకి వెళ్లేలా చేస్తారు. కోమాలోకి వెళ్లడంతో శ్రీ విద్య ఆత్మ ఓ టెడ్డీ బేర్‌లో చేరుతుంది. ఎవరికైనా ఆపద వస్తే తన ఇంటెలిజెన్స్‌తో సహాయ పడే శివ (ఆర్య)ను టెడ్డీ బేర్ కలిసి సహాయం కోరుతుంది. శ్రీ విద్యకు వైద్యులు ఎందుకు ప్రమాదకరమైన ఇంజెక్షన్లు ఇచ్చి కోమాలోకి పంపారు? శ్రీ విద్యను శివ కాపాడాడ ?? లేదా అనేదే మిగతా సినిమా కథ.[3]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)