ట్రాన్స్ | |
---|---|
దర్శకత్వం | అన్వర్ రషీద్ |
రచన | విన్సన్ట్ వడక్కన్ |
కథ | విన్సన్ట్ వడక్కన్ |
నిర్మాత | అన్వర్ రషీద్ |
తారాగణం | ఫహాద్ ఫాజిల్ గౌతమ్ మీనన్ దిలీష్ పోతన నజ్రియా నజీమ్ చెంబన్ వినోద్ జోస్ సౌబిన్ షాహిర్ వినాయకన్ అర్జున్ అశోకన్ |
ఛాయాగ్రహణం | అమల్ నీరద్ |
కూర్పు | ప్రవీణ్ ప్రభాకర్ |
సంగీతం | పాటలు: జాక్సన్ విజయన్ వినాయకన్ బ్యాక్‌గ్రౌండ్ సంగీతం : రేసుల్ పూకుట్టి జాక్సన్ విజయన్ సుషిన్ శ్యామ్ |
నిర్మాణ సంస్థ | అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 7, 2021 |
సినిమా నిడివి | 170 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ట్రాన్స్ 2020లో విడుదలైన మలయాళం సినిమా. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అన్వర్ రషీద్ నిర్మించిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంలో 2020 ఫిబ్రవరి 20న విడుదల చేసి, తెలుగు అదే పేరుతో డబ్బింగ్ చేసి 2021 ఆగష్టు 7న ఆహా ఓటిటిలో విడుదల చేశారు.[1]
చిన్నప్పుడే కళ్ళముందు తల్లి అప్పుల బాధ వలన ఉరి వేసుకోవడం చూసిన విజ్జు ప్రసాద్ (ఫహాద్ ఫాజిల్), మతి స్థిమితంగా లేని తమ్ముడితో కలిసి జీవిస్తూ ఉంటాడు. పెద్దయ్యాక మోటివేషనల్ స్పీచులు ఇచ్చే వృత్తిని ఎంచుకొని తన తమ్ముడి రోగాన్ని నయం చేద్దామని డాక్టర్ దగ్గరకు తీసుకు వెళుతుంటే అన్న పైనే దాడి చేస్తాడు. అయినా సరే తన తమ్ముడిని ఎలాగైనా బాగు చేసుకోవాలని అనుకుంటాడు, కానీ ఒకరోజు తన అన్నకి ఇబ్బంది కలగకూడదని అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. తరువాత కొంతకాలంపై అతడికి ఫాస్టర్ గా ఉద్యోగ అవకాశం వస్తుంది, అది తన జీవితాన్ని మార్చేస్తుంది. ఆ తరువాత అతడు ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.