వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | నుండా, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా | 1954 జనవరి 23|||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 178 cమీ. (5 అ. 10 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్-స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 345) | 1989 26 జనవరి - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1989 24 ఆగస్టు - England తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2020 19 August |
ట్రెవర్ విక్టర్ హోన్స్ (జననం 1954, జనవరి 23) క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియన్ మాజీ క్రికెట్ ఆటగాడు. స్పిన్ బౌలర్‌గా ఏడు టెస్ట్ మ్యాచ్‌లలో ఆడాడు. తరువాత ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్‌గా ఉన్నాడు.
1985-86, 1986-87లో వివాదాస్పద దక్షిణాఫ్రికా సిరీస్‌లలో రెబెల్ ఆస్ట్రేలియన్ల తరపున ఆడటానికి సైన్ అప్ చేసాడు. మాజీ ఆస్ట్రేలియన్ టెస్ట్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హొగన్తోపాటు టూరింగ్ పార్టీలో ఉన్న ఇద్దరు స్పిన్ బౌలర్లలో హోన్స్ ఒకడు. రెబెల్ ఆస్ట్రేలియన్లలో హోన్స్ ఒకడు తరువాతి రెండు సంవత్సరాలపాటు రాష్ట్ర, టెస్ట్ క్రికెట్ ఆడకుండా నిషేధించబడ్డాడు.
హోన్స్ 1989లో తన ఏడు టెస్టులన్నింటినీ ఆడాడు, 35 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన 1988-89 సిరీస్‌లో చివరి రెండు టెస్టుల్లో, ఇంగ్లాండ్‌లో 1989 యాషెస్ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో ఆడాడు. ఆ సిరీస్‌లో అత్యధిక బౌలింగ్ విజయం టెర్రీ ఆల్డర్‌మాన్, జియోఫ్ లాసన్, మెర్వ్ హ్యూస్ల ఫాస్ట్ బౌలింగ్ త్రయం కారణంగా ఉన్నప్పటికీ, హోన్స్ 11 వికెట్లు పడగొట్టాడు, బ్యాట్‌తో సగటు 31.75తో ఉన్నాడు.[1]
షెఫీల్డ్ షీల్డ్ క్రికెట్లో క్వీన్స్లాండ్ తరఫున ఆరవ నంబర్‌కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే లాట్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా హోన్స్. తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను 152 మ్యాచ్‌లలో రెండు సెంచరీలు, 30 అర్ధ సెంచరీలతో ముగించాడు, అయితే ఏడు ఇన్నింగ్స్‌లలో 40 అత్యుత్తమ టెస్ట్ స్కోరు చేశాడు.
సెలెక్టర్‌గా హోన్స్ ఆస్ట్రేలియా క్రికెట్‌పై కూడా ప్రభావం చూపాడు.[2] 1994 నుండి 2006 వరకు,[3] 2014 నుండి ఇప్పటి వరకు (2021) సెలెక్టర్‌గా ఉన్నాడు; 1996 నుండి 2006 వరకు, 2016 నుండి 2021 వరకు సెలెక్టర్ల ఛైర్మన్ గా పనిచేశాడు.[4] ఛైర్మన్‌గా తన మొదటి పదవీకాలంలో ఇయాన్ హీలీ, మార్క్ వా యొక్క కెరీర్లను ముగించడంతోపాటు స్టీవ్ వాను వన్డే కెప్టెన్సీ నుండి తొలగించడం వంటి అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు.