ట్వెల్త్ ఫెయిల్ | |
---|---|
దర్శకత్వం | విధు వినోద్ చోప్రా |
రచన | విధు వినోద్ చోప్రా జస్కున్వర్ కోహ్లీ |
దీనిపై ఆధారితం | అనురాగ్ పాఠక్ - 12th ఫెయిల్ |
నిర్మాత | విధు వినోద్ చోప్రా యోగేష్ ఈశ్వర్ |
తారాగణం |
|
Narrated by | అనంత్ వి జోషి |
ఛాయాగ్రహణం | రండరాజన్ రామబద్రన్ |
కూర్పు | విధు వినోద్ చోప్రా జస్కున్వర్ కోహ్లీ |
సంగీతం | శంతను మోయిత్ర |
నిర్మాణ సంస్థ |
|
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 27 అక్టోబరు 2023 |
సినిమా నిడివి | 146 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹20 కోట్లు[2] |
బాక్సాఫీసు | అంచనా ₹66 కోట్లు[3] |
ట్వెల్త్ ఫెయిల్ 2023లో విడుదలైన హిందీ సినిమా. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషిల నిజ జీవిత వృత్తాంతంతో ప్రేరణ పొంది రాసిన ‘12th ఫెయిల్’ నవల ఆధారంగా వినోద్ చోప్రా ఫిల్మ్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా, యోగేష్ ఈశ్వర్ నిర్మించిన ఈ సినిమాకు విధూ వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, ప్రియాంశూ ఛటర్జీ, సంజయ్ బిష్నోయి, హరీష్ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలై డిసెంబర్ 29 నుండి హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
ట్వెల్త్ ఫెయిల్ సినిమా 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు తో సహా పాలు విభాగాల్లో అవార్డులను అందుకుంది.[5]
బిహార్‌లోని చంబల్ గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ శర్మ (విక్రాంత్ మెస్సీ) ప్రతీసారి 12వ తరగతి ఫెయిల్ అవుతూ ఉంటాడు. మనోజ్ తండ్రి (హరీష్ ఖన్నా ఓ ప్రభుత్వ ఆఫీసులోని క్లర్క్ గా పని చేస్తూ లంచం తీసుకోను అన్నందుకు అన్యాయంగా తనను సస్పెండ్ చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తుంటాడు. ఈ క్రమంలో తన ఊరికి వచ్చిన డిఎస్పీ దుశ్యంత్ (ప్రియాన్షు ఛటర్జీ) ని చూసి తనలాగా పోలీస్ అవ్వాలనుకుంటాడు. మనోజ్ నాయనమ్మ దాచుకున్న పెన్షన్ డబ్బులు ఇచ్చి గ్వాలియర్‌కు కోచింగ్ కోసం పంపిస్తుంది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ప్రీతమ్ పాండే (అనంత్ వి జోషి)ను రైల్వే స్టేషన్‌లో కలిసి ఐపిఎస్ అవ్వడానికి డిల్లీ వెళ్తాడు. అక్కడేం జరిగింది ? మనోజ్ జీవితంలోకి శ్రద్ధా (మేధా శంకర్) ఎలా వచ్చింది ? అసలు మనోజ్ ఐపిఎస్ అయ్యాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[6]
అవార్డు | వేడుక తేదీ | విభాగం | గ్రహీతలు | ఫలితం | మూ |
---|---|---|---|---|---|
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | 28 జనవరి 2024 | ఉత్తమ చిత్రం | వినోద్ చోప్రా ఫిల్మ్స్ , జీ స్టూడియోస్ | గెలుపు | [8] |
ఉత్తమ చిత్రం (విమర్శకులు) | విధు వినోద్ చోప్రా | నామినేట్ | |||
ఉత్తమ దర్శకుడు | గెలుపు | ||||
ఉత్తమ స్క్రీన్ ప్లే | గెలుపు | ||||
ఉత్తమ డైలాగ్ | నామినేట్ | ||||
ఉత్తమ నటుడు (విమర్శకులు) | విక్రాంత్ మాస్సే | గెలుపు | |||
ఉత్తమ ఎడిటింగ్ | జస్కున్వర్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా | గెలుపు | |||
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ | ప్రశాంత్ బిడ్కర్ | నామినేట్ | |||
ఉత్తమ సినిమాటోగ్రఫీ | రండరాజన్ రామబద్రన్ | నామినేట్ | |||
ఉత్తమ సౌండ్ డిజైన్ | మానవ్ శ్రోత్రియ | నామినేట్ | |||
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | శంతను మోయిత్ర | నామినేట్ | |||
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | మాళవికా బజాజ్ | నామినేట్ |