డబ్బింగ్ జానకి

డబ్బింగ్ జానకి

జన్మ నామంజానకి
జననం (1949-08-28) 1949 ఆగస్టు 28 (వయసు 75)
India పెద్దాపురం
ఆంధ్రప్రదేశ్
ప్రముఖ పాత్రలు సాగర సంగమం
గీతాంజలి
జంబలకిడిపంబ

డబ్బింగ్ జానకి దక్షిణభారత చలన చిత్ర నటి. ఈమె దాదాపు 600 చిత్రాలలో నటించింది. ఎక్కువగా తల్లి పాత్రలను పోషించింది. తొమ్మిదేళ్ళ వయసు నుంచే నాటకాలలో నటించడం ప్రారంభించిన ఈమె 1958 లో వచ్చిన భూకైలాస్ చిత్రంతో సినిమాకు పరిచయం అయింది. సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ తల్లిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకొంది. గాంధీ సినిమాకు తెలుగులో కస్తూర్బా పాత్రకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ జానకి గా మారింది. సినిమాల్లోనే కాకుండా టీవీ ధారావాహికల్లో కూడా నటించింది.

నేపధ్యము

[మార్చు]

వీరిది పెద్దాపురం లోని మధ్యతరగతి కుటుంబం. అక్కడ దగ్గర ఎక్కువగా నాటకాలు వేసేవారు. ఈమె తొమ్మిదేళ్ల వయసులో నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్లు ఒకరు ఓ పాత్ర ఉందంటూ తీసుకెళ్లారు.[1] అప్పట్నుంచి నాటకాలతో బిజీ అయిపోయింది. ఏడో తరగతితో చదువు ఆపేసింది. ప్రస్తుతం ఈవిడ చెన్నైలో ఉంటున్నది. షూటింగ్, డబ్బింగ్ ఉంటే హైదరాబాద్ వస్తుంది. ఈవిడ ఇద్దరు కొడుకులు. కోడళ్లూ, మనవలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.

నట జీవితము

[మార్చు]

పదహారేళ్లు వచ్చేప్పటికి ఈమెకు పెళ్త్లెంది. భర్తది మిలటరీ ఉద్యోగం. ఆయనకీ నాటకాలంటే ఆసక్తి. పెళ్లయ్యాక తన నుంచీ ప్రోత్సాహం లభించింది. అయితే అప్పటికే వీరు చెన్నైలో స్థిరపడ్డారు. ఓసారి బస్సులో వెళుతుంటే ఏవీఎమ్ సంస్థలో పనిచేసే ఓ సహాయ దర్శకుడు ఈమెను చూసి 'సినిమాల్లో నటిస్తారా' అని అడిగారు. ఈమె భర్త అంగీకరించారు. అలా 1958లో 'భూ కైలాస్'లో చెలికత్తె పాత్రతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తరువాత నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలుపడింది. ఆర్థిక ఇబ్బందులూ ఉండటంతో గ్రూపు డాన్సర్‌గా కూడా చేసేది. తమిళం, తెలుగు అగ్ర దర్శకులూ, నటులందరితో కలిసి పనిచేసింది. చాలా సినిమాల్లో ఈమె కంటే పెద్దవాళ్లకే అమ్మగా కనిపించింది.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

శంకరాభరణం సినిమా విజయోత్సవ వేడుక విజయవాడలో జరిగింది. ఆ కార్యక్రమానికి ఈమె, షావుకారు జానకి, గాయని ఎస్. జానకి వెళ్లారు. 'వేదిక మీదకు జానకిగారు రావాలి' అని మైకులో చెప్పేసరికి ముగ్గురూ లేచి నిలబడ్డారు. అప్పుడు డబ్బింగ్ జానకి అని అవతలి వ్యక్తి అనడంతో.. ఆ రోజు నుంచి ఈమె పేరుకు మొదట్లో డబ్బింగ్ వచ్చి చేరింది.

విశేషాలు

[మార్చు]
  • 'మాతృ దినోత్సవం' వచ్చిందంటే '20వ శతాబ్దం' చిత్రం లోని 'అమ్మను మించి దైవమున్నదా' పాట టీవీల్లో కచ్చితంగా వస్తుంది. అందులో సుమన్ తల్వార్కి తల్లిగా ఈవిడ చేసిన పాత్రకి మంచి పేరొచ్చింది.
  • ఈవిడ చేసిన సినిమాల్లో తొంభై శాతం వరకూ కంట తడిపెట్టించే సెంటిమెంటు పాత్రలే. గ్లిజరిన్ బాటిల్ ఎప్పుడూ పక్కన ఉండాల్సిందే. సెట్‌లో ఏడ్చీ ఏడ్చీ ఇంటికి వెళ్లేసరికి కళ్లు ఎర్రగా వాచిపోయేవి. ఒకసారి 'రక్తకన్నీరు' నాటకం వేసినప్పుడు ఏకథాటిగా మూడు గంటలు ఏడవాల్సి వచ్చింది. ఆ నాటకం పూర్తయ్యేసరికి కళ్లలో నీళ్లు ఇంకిపోయాయి.
  • ఈవిడ నటించిన సినిమాల్లో బాగా నచ్చినవంటే 'జంబలకిడి పంబ'లోని పాత్ర... 'రామాయణంలో పిడకల వేట'లోని గయ్యాళి అత్త పాత్ర.
  • సెట్‌లో మర్చిపోలేని సందర్భమంటే 'నిండు సంసారం' సినిమా చిత్రీకరణలో ఈవిడ చెట్టు మీద నుంచి నీళ్లలో దూకాలి. అసలే ఈవిడకు నీళ్లంటే భయం. దర్శకుడు చెప్పినప్పుడు కాకుండా ముందుగానే దూకడంతో డూప్ ఆర్టిస్టు ఈవిడను పట్టుకోలేదు. నీళ్లలో పడిపోయింది. తరువాత యూనిట్ సభ్యులు కాపాడారు కానీ నీళ్లు బాగా మింగడంతో స్పృహ కోల్పోయింది. ప్రాణం పోతుందేమోనని చాలామంది భయపడిపోయారు.

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు (పాక్షిక జాబితా)

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dubbing Janaki: ముందు తిన్నానని.. క్యారేజ్‌ను కాలుతో తన్నింది: డబ్బింగ్‌ జానకి". EENADU. Retrieved 2023-05-16.

బయటి లింకులు

[మార్చు]