డాకి | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°11′0″N 92°1′0″E / 25.18333°N 92.01667°E | |
దేశం | భారతదేశం ( India) |
రాష్ట్రం | మేఘాలయ |
జిల్లా | పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లా |
భాషలు | |
• అధికారిక భాషలు | వార్ భాష, ఖాసీ భాష, ఇంగ్లీష్ భాష |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 793109 |
Vehicle registration | ML |
దగ్గరి ప్రదేశం | షిల్లాంగ్, జోవాయి, సిల్చార్ |
డాకి భారతదేశం, మేఘాలయ రాష్ట్రం, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలోని పట్టణం.
ఇది భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులో 25°11′0″N అక్షాంశం, 92°1′0″E రేఖాంశం వద్ద ఉంది.[1]
డాకి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లేదా డాకి సరిహద్దు క్రాసింగ్ అనేది భారతదేశం, మేఘాలయ రాష్ట్రం, పశ్చిమ జైంతియా హిల్స్ జిల్లాలో భారతదేశం-బంగ్లాదేశ్ మధ్య ఉన్న కొన్ని రహదారి సరిహద్దు క్రాసింగ్‌లలో ఇది ఒకటి, డాకి-తమబిల్ రోడ్డు భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు దాటుతుంది. ఇది ప్రధానంగా బంగ్లాదేశ్‌కు బొగ్గు రవాణా చేయడానికి ఉపయోగించబడుతుంది. ప్రతిరోజూ దాదాపు 500 ట్రక్కులు సరిహద్దును దాటుతాయి.[2][3][4][5]
ప్రతిరోజూ ఉదయం షిల్లాంగ్‌లోని బడా బజార్ నుండి డాకీ బోర్డర్ పోస్ట్‌కి వెళ్లడానికి అనేక ప్రైవేట్ రవాణా సేవలు అందుబాటులో ఉంటాయి. షిల్లాంగ్ నుండి 70 కిలోమీటర్ల (43 మైళ్ళు) వరకు బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లోని తమబిల్ బస్ స్టేషన్ 1.5 కిలోమీటర్ల (0.93 మైళ్ళు) దూరంలో ఉంది, సాధారణ బస్సు సర్వీసు కోసం సిల్హెట్ 55 కిలోమీటర్ల (34 మైళ్ళు) దూరంలో ఉంది.[6][7]
డాకి వంతెన అనేది ఒక వేలాడే వంతెన ఇది ఉమాంగోట్ నదిపై ఉంది. దీనిని 1932 సంవత్సరంలో బ్రిటిష్ వారు నిర్మించారు.[8]