డాన్ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రాఘవ లారెన్స్ |
---|---|
కథ | రాఘవ లారెన్స్ |
చిత్రానువాదం | రాఘవ లారెన్స్ |
తారాగణం | అక్కినేని నాగార్జున, అనుష్క, రాఘవ లారెన్స్, నిఖిత, కెల్లీ డార్జ్, నాజర్, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, జీవా, సుప్రీత్ |
నిర్మాణ సంస్థ | రాయల్ ఫిల్మ్ కంపెనీ, శ్రీ కీర్తి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 20 డిసెంబర్ 2007 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
డాన్ 2007, డిసెంబర్ 20న విడుదలైన తెలుగు చలన చిత్రం. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క, రాఘవ లారెన్స్, నిఖిత, కెల్లీ డార్జ్, నాజర్, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, జీవా, సుప్రీత్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించగా, రాఘవ లారెన్స్ సంగీతం అందించాడు.
చిన్నప్పటినుంచి న్యాయం కోసం పోరాడుతూ పేదల పక్షాల నిలిచే తత్వం సూరి(నాగార్జున)ది. అందుకే గూండాల చేతిలో అన్యాయానికి గురయ్యే అనాధ బాలల తరఫున డాన్ గా నిలబడతాడు. ఆ అనాధలలో ఒకరైన రాఘవ(లారెన్స్) డాన్ కు దగ్గరవుతాడు. డాన్ ను అన్నా అని పిలిచే స్థాయికి చేరతాడు. ఎపుడైతే తమకు సమస్య ఎదురవుతుందో అపుడు అనాధలు, పేదలు డాన్ ను సంప్రదిస్తారు. ఇదిలా ఉంటే రాఘవ డానన్నకు పెళ్లి చేయడం కోసం ఒక అమ్మాయిని చూస్తాడు. ఇదిలా ఉంటే తన రైట్ హ్యాండ్ నిలుస్తూ వస్తున్న మూర్తి(చలపతిరావు) కుమార్తె ప్రియ(అనుష్క) డాన్ మనసును గెలుచుకుంటుంది. మరోవైపు రాఘవ కూడా నందిని(నిఖిత) ప్రేమలో పడతాడు. ఇక్కడ వ్యవహారాలు ఇలా ఉంటే అంతర్జాతీయ డాన్ స్టిఫెన్(కెల్లీ డార్జ్) ఆంధ్రప్రదేశ్ ను కూడా తన హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలెడతాడు. దీనికి సూరి పెద్ద అడ్డంకిగా స్టిఫెన్ భావిస్తాడు. ముందుగా సూరిను మచ్చిక చేసుకోవడానికి స్టిఫెన్ ప్రయత్నిస్తాడు. సూరి లైట్ గా తీసుకుంటాడు. అంతేకాదు స్టిఫెన్ పంపిన వ్యక్తులలో ఇద్దరిని చంపివేస్తాడు. దీనికి ఆగ్రహించిన స్టిఫెన్, రత్నం(కోట శ్రీనివాసరావు) సాయంతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తాడు. బాంబులు పేలుళ్ల వందలమంది చావుకు కారకుడవుతాడు. దీనికి మరింత ఆగ్రహానికి గురైన సూరి, స్టిఫెన్ మనుషలపై పట్టు సాధించడానికి ప్రయత్నించి సఫలమవుతాడు. తను ప్రేమలో పడ్డ నందిత స్టిఫెన్ మనిషని రాఘవ గ్రహిస్తాడు. రాఘవకు స్టిఫెన్ నుంచి ప్రమాదం ఉండవచ్చని భావిస్తున్న తరుణంలోనే రాఘవ, స్టిఫెన్ చేతిలో చంపివేయబడతాడు. ఆ తరువాత ఏమైందన్నది మిగతా కథ.
సూపర్ మూవీస్