![]() Logo of Digital Rupee ![]() Digital Banknotes and Coins | |
ISO 4217 | |
---|---|
Code | INR (numeric: 356) |
Subunit | 0.01 |
Unit | |
Unit | రూపాయి |
Symbol | e₹ |
Denominations | |
Subunit | |
⅟100 | పైసా |
Symbol | |
పైసా | ![]() |
Banknotes | |
Freq. used | e₹2, e₹5, e₹10, e₹20, e₹50, e₹100, e₹200, e₹500, e₹2,000 |
Coins | |
Freq. used | 50 e![]() |
Demographics | |
Date of introduction | |
User(s) | ![]() |
Issuance | |
Central bank | భారతీయ రిజర్వ్ బ్యాంకు |
Printer |
|
Website |
|
Valuation | |
Inflation | ![]() |
Source | RBI – Annual Inflation Report |
Method | Consumer price index (India)[5] |
Pegged with | మూస:Flagd Indian Rupee (at par) |
Value | $1 = e₹82.28 €1 = e₹86.64 ₹1 = e₹1.00 ¥1 = e₹11.80 (2022 డిసెంబరు 7) |
డిజిటల్ రూపాయి (e₹) [6] లేదా eINR లేదా E-రూపీ అనేది భారతీయ రూపాయికి డిజిటల్ వెర్షన్. దీనిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీగా (CBDC) జారీ చేసింది. [7] డిజిటల్ రూపాయిని తీసుకురావాలనే ప్రతిపాదన 2017 జనవరిలో ప్రతిపాదించగా, 2022 డిసెంబరు 1 న జారీ చేసారు.[8] డిజిటల్ రూపాయి బ్లాక్‌చెయిన్ డిస్ట్రిబ్యూట్-లెడ్జర్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. [9]
బ్యాంకు నోట్ల లాగానే ఇది కూడా ప్రత్యేకంగా గుర్తించదగేలా ఉంటుంది. దీన్ని సెంట్రల్ బ్యాంక్ నియంత్రిస్తుంది. దీని బాధ్యత ఆర్‌బిఐపై ఉంది. ప్లాన్‌లలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అందుబాట్లు రెండూ ఉన్నాయి. [10] ఆర్‌బిఐ ఇంటర్‌బ్యాంక్ సెటిల్‌మెంట్ల కోసం ఆర్థిక సంస్థలకు హోల్‌సేల్ కోసం డిజిటల్ రూపాయిని (e₹-W), వినియోగదారుల, వ్యాపారాల లావాదేవీల కోసం రిటైల్ కోసం డిజిటల్ రూపాయినీ (e₹-R) ప్రారంభించింది. [11] డిజిటల్ రూపాయిని అమలు చేయడం ద్వారా సాధారణ ప్రజలు, వ్యాపారాలు, బ్యాంకులు, RBI భౌతిక కరెన్సీ ముద్రణపై పెడుతున్న ₹4,984 కోట్ల ఖర్చును తీసివేయడం లక్ష్యంగా పెట్టుకుంది.[12]
2017లో, భారతదేశంలో వర్చువల్ కరెన్సీల పాలన, వినియోగంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ (MoF) లోని ఆర్థిక వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి అంతర-మంత్రిత్వ కమిటీని (IMC) ఏర్పాటు చేసారు. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీని (DLT) ఉపయోగించి ఫియట్ కరెన్సీ డిజిటల్ రూపాన్ని సిఫార్సు చేసింది. CBDC యొక్క చట్టపరమైన, సాంకేతిక అభివృద్ధిని పరిశీలించే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం కోసం MoF ఆర్థిక సేవల విభాగం, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) లను నియమించారు. [13] క్రిప్టోకరెన్సీలకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేకుండానే, RBI భవిష్యత్ CBDC అభివృద్ధిపై ప్రణాళికను ప్రారంభించింది. [14]
డిజిటల్ రూపాయి -హోల్‌సేల్ (e₹-W) అనే హోల్‌సేల్ విభాగంలో పైలట్ ప్రాజెక్టును 2022 నవంబరు 1 న ప్రారంభించారు. ప్రభుత్వ సెక్యూరిటీలలో సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్‌మెంట్‌కు మాత్రమే దీన్ని వినియోగించారు. (e₹-W) ను ఉపయోగించడం వలన ఇంటర్-బ్యాంక్ మార్కెట్ మరింత సమర్థవంత మౌతుందని భావిస్తున్నారు. దీనివలన సెటిల్‌మెంట్ గ్యారెంటీల కోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాల అవసరం ఉండదు. సెటిల్‌మెంట్ రిస్క్‌ని తగ్గించడానికి అనుషంగిక అవసరం కూడా ఉండదు. దీనివలన డబ్బు సెటిల్‌మెంట్ లావాదేవీల ఖర్చులు తగ్గుతాయి. డిజిటల్ రూపాయి-రిటైల్ (e₹-R)గా పిలువబడే రిటైల్ విభాగంలో పైలట్ ప్రాజెక్టు 2022 డిసెంబరు 1 న మొదలైంది. కొద్దిమంది కస్టమర్లు వ్యాపారులతో కూడిన ఒక క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (CUG)లో దీన్ని ప్ర్యయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.[15]
2022 నవంబరులో e₹-W తో, సగటున రోజుకు ₹325 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. e₹-R పైలట్లో మొదటి రెండు రోజులకు, RBI ₹3 కోట్ల విలువైన డిజిటల్ కరెన్సీలను సృష్టించింది. భౌతిక కరెన్సీలా కాకుండా, e₹ లో నష్టానికి వ్యతిరేకంగా రికవరీ కోసం ఒక ఎంపిక ఉంది. e₹-R పైలట్ దశలో రిజర్వు బ్యాంకు, P2P, P2M లావాదేవీల కోసం నిర్దుష్టమైన వినియోగ కేసులను పరీక్షిస్తోంది. RBI సంస్థాగత, వ్యక్తిగత స్థాయిలో కూడా e₹ వినియోగాన్ని విస్తరించాలని యోచిస్తోంది. [16] ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకారం, CBDC స్వయంగా ఎలాంటి వడ్డీ లభించదు గానీ, దాన్ని బ్యాంకు డిపాజిట్లుగా మార్చుకోవచ్చు. e₹-R బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని ఉపయోగిస్తోందని కూడా ఆయన స్పష్టం చేశారు.[17] RBI ప్రకారం, డిజిటల్ రూపాయి 2023 ఫిబ్రవరి 8 నాటికి 50,000 మంది వినియోగదారులు, 5,000 మంది వ్యాపారులకు చేరుకుంది.[18]
ఇన్నోవిటీ టెక్నాలజీస్, ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ల భాగస్వామ్యంతో రిలయన్స్ రిటైల్, దేశంలో e₹-Rని ఆమోదించిన మొదటి పెద్ద వ్యవస్థీకృత రిటైల్ చైన్‌గా అవతరించింది. [19] ఆన్‌లైన్ రిటైల్ లావాదేవీ కోసం e₹-Rని ప్రాసెస్ చేయడానికి CCAvenue మొదటి చెల్లింపు గేట్‌వే అయింది. [20]