డిప్ గొగోయ్ | |||
పదవీ కాలం 2002 – 15 మే 2014 | |||
ముందు | తరుణ్ గొగోయ్ | ||
---|---|---|---|
తరువాత | గౌరవ్ గొగోయ్ | ||
నియోజకవర్గం | కలియాబోర్ | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2001 – 2001 | |||
ముందు | హేమంత కలిత | ||
తరువాత | తరుణ్ గొగోయ్ | ||
నియోజకవర్గం | తితబార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | రంగమాటి, జోర్హాట్, అస్సాం, భారతదేశం | 1951 డిసెంబరు 17||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | కామేలేశ్వర్ గొగోయ్, ఉష | ||
జీవిత భాగస్వామి | మిటాలి గొగోయ్ | ||
పూర్వ విద్యార్థి | డిబ్రూఘర్ విశ్వవిద్యాలయం | ||
మూలం | [1] |
డిప్ గొగోయ్ ( అస్సామీ : দীপ গগৈ ; జననం 17 డిసెంబర్ 1951) (జననం 1 మార్చి 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి శాసనసభ్యుడిగా, మూడుసార్లు కలియాబోర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3] డిప్ గొగోయ్ అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సోదరుడు.
డిప్ గొగోయ్ 1951 డిసెంబరు 17న అస్సాం రాష్ట్రం, జోర్హాట్ లో జన్మించాడు. ఆయన డిబ్రూగర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేశాడు. డిప్ గొగోయ్ మితాలీ గొగోయ్‌ని వివాహం చేసుకున్నాడు.
డిప్ గొగోయ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి తితబార్ శాసనసభ నియోజకవర్గం నుండి 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2002లో కలియాబోర్ నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2004, 2009లో వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.