డియర్ ఫ్రెండ్ హిట్లర్ | |
---|---|
దస్త్రం:Dear Friend Hitler film poster.jpg Theatrical release poster | |
దర్శకత్వం | రాకేష్ రంజన్ కుమార్ [2] |
స్క్రీన్ ప్లే | రాకేష్ రంజన్ కుమార్ |
కథ | నళిన్ సింగ్ రాకేష్ రంజన్ కుమార్ |
నిర్మాత | డా. పర్త్ |
తారాగణం | నళిన్ సింగ్ రఘుబీర్ యాదవ్ నేహా ధుపియా అమన్ వర్మ [2] |
ఛాయాగ్రహణం | ఫువాడ్ ఖాన్ |
కూర్పు | శ్రీ నారాయణ్ సింగ్ |
సంగీతం | అరవింద్-లైటన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సంజయ్ చౌదరి |
పంపిణీదార్లు | ఆమ్రాపాలి మీడియా విజన్ ప్రైవేట్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 29 జూలై 2011[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
డియర్ ఫ్రెండ్ హిట్లర్, భారతదేశంలో గాంధీ టు హిట్లర్ గా విడుదల చేయబడిన సినిమా.[1] ఇది 2011 నాటి భారతీయ నాటక చలన చిత్రం. ఇది నాజీ పార్టీ నాయకుడు, జర్మనీ ఛాన్సలర్, నాజీ జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు మోహన్ దాస్ గాంధీ రాసిన లేఖల ఆధారంగా రూపొందించబడింది. అడాల్ఫ్ హిట్లర్‌గా రఘుబీర్ యాదవ్, ఎవబ్రాన్‌గా నేహా ధూపియా నటించిన ఈ చిత్రానికి రాకేష్ రంజన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని ఆమ్రాపాలి మీడియా విజన్ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇది 61 వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. అక్కడ దీనికి ప్రతికూల సమీక్షలు వచ్చాయి.[3][4] ఫిల్మ్ బిజినెస్ ఆసియా పత్రిక , "రెచ్చగొట్టే టైటిల్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం హంతకుడు ఫ్యూరర్‌కు నివాళి కాదు" అని పేర్కొంది.[5] ఇది భారతదేశంలో 2011 జూలై 29 న ప్రదర్శించబడింది.
ఈ చిత్రం రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో దృశ్యాలతో తీయబడింది. మోహన్ దాస్ గాంధీ (అవిజిత్ దత్), అడాల్ఫ్ హిట్లర్ (రఘుబీర్ యాదవ్) కు రాసిన లేఖలు, హిట్లర్ తన దీర్ఘకాల ప్రేమికురాలు ఇవా బ్రౌన్ (నేహా ధూపియా) తో ఉన్న సంబంధాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. హిట్లర్ ఆమెను బెర్లిన్ బంకర్‌లో తన చివరి రోజుల్లో వివాహం చేసుకున్నాడు. కానీ అందులో వారు మరణించారు. ఈ చిత్రం గాంధీ, హిట్లర్ సిద్ధాంతాల మధ్య వ్యత్యాసాన్ని వర్ణిస్తుంది. నాజీయిజం కంటే గాంధీజం యొక్క ఆధిపత్యాన్ని పేర్కొంది.
అనుపమ్ ఖేర్ వాస్తవానికి హిట్లర్ పాత్రను పోషించడానికి అంగీకరించాడు, కానీ హిట్లర్ లక్షలాది మంది యూదులను ఊచకోత కోసిన కారణంగా ఆ పాత్రను పోషించినందుకు భారతదేశంలోని యూదు సంస్థలు ఖండించడంతో అతను వెనక్కి తగ్గాడు.[6][7]
<ref>
ట్యాగు; "indiatimes1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు