డెన్మార్క్‌లో హిందూమతం మైనారిటీ మతం. 2020 నాటికి డెన్మార్క్ లో 30,000 (0.5%) మంది హిందువులు ఉన్నారు. [1]
శ్రీలంకలో తీవ్రమవుతున్న ఘర్షణ కారణంగా 1983లో శ్రీలంక తమిళ మూలానికి చెందిన హిందువులు మొదటగా డెన్మార్కు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది పురుషులు. వారిని శరణార్థులుగా వర్గీకరించారు. ఆ తరువాత వారు పెళ్ళి చేసుకోవడం గాని, తాము వదలి వచ్చిన కుటుంబాన్ని తెచ్చుకోవడం గానీ చేసారు. దాదాపు సగం మంది తమిళులకు డేనిష్ పౌరసత్వం మంజూరు చేసారు.
శ్రీలంక తమిళ మూలానికి చెందిన ఈ హిందువులు సమీప భవిష్యత్తులో శ్రీలంకలో వివాదానికి ఎటువంటి పరిష్కారం దొరకదని గ్రహించారు. వారు డెన్మార్క్‌లో తమ సాంస్కృతిక, మతపరమైన ఆచారాలలో కొన్నింటిని పునర్నిర్మించడం లేదా పునర్వ్యవస్థీకరించడం ప్రారంభించారు.
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
2010 | 12,000 | — |
2015 | 11,400 | −5.0% |
2017 | 17,100 | +50.0% |
2020 | 30,000 | +75.4% |
సంవత్సరం | శాతం | మార్పు |
---|---|---|
2010 | 0.2% | - |
2015 | 0.2% | - |
2017 | 0.3% | +0.1% |
2020 | 0.5% | +0.2% |
2010 అంచనా ప్రకారం డెన్మార్క్ లో సుమారు 12,000 హిందువులు ఉన్నారు.
శ్రీలంక, భారతీయ మూలాలున్నవారు డెన్మార్క్‌లోని హిందువులలో ఎక్కువ మంది ఉన్నారు. 2017లో మొత్తం 57 లక్షల జనాభాలో సుమారు 18,000–19,000 మంది హిందువులు ఉన్నారు. మొత్తం జనాభాలో ఇది 0.3%.
డానిష్ జాతి సమాజంలో హిందూ మతం కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. డానిష్ జాతీయుల్లో దాదాపు 2,000 మంది హిందూ-సంబంధ సమూహాలకు గాని, హిందూ-ప్రేరేపిత సమూహాలకు గానీ చెందినవారు. [2]
డెన్మార్క్‌లో ఐదు హిందూ దేవాలయాలు ఉన్నాయి. రెండు వినాయకుడి ఆలయాలు, మిగతావి దేవత అభిరామికి చెందినవి. ISKCON దేవాలయాలు కూడా ఉన్నాయి.
డెన్మార్క్‌లో 9 నమోదైన హిందూ సమూహాలు ఉన్నాయి, [3] వాటిలో హిందూ స్వయంసేవక్ సంఘ్ అనే సంస్థ ఒకటి. [4]
2011లో, పశ్చిమ కోపెన్‌హాగన్‌లోని ఒక హిందూ దేవాలయంపై ముస్లిం యువకుల బృందం దాడి చేసి, రాళ్లు విసిరి కిటికీలను పగలగొట్టింది. ఒక పోలీసు అధికారి వచ్చి, జరిగిన నష్టాన్ని గమనించి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత, దాడికి పాల్పడిన అదే గుంపు మరింత మందితో వచ్చి, మళ్లీ రాళ్లు విసిరి, తోటలోకి ప్రవేశించి, తులసి గదిలో వీధికి ఎదురుగా ఉన్న అన్ని కిటికీలను బద్దలు కొట్టింది. [5] [6]