![]() Malan in 2021 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | Dawid Johannes Malan | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | Roehampton, London, England | 1987 సెప్టెంబరు 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Top-order batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Charl Malan (brother) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 677) | 2017 జూలై 27 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 జనవరి 14 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 254) | 2019 మే 3 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 6 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 81) | 2017 జూన్ 25 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 1 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 29 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06 | బోలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006–2019 | మిడిల్‌సెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14–2014/15 | Prime Doleshwar Sporting Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017, 2019 | పెషావర్ జాల్మి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Barisal Bulls | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | కేప్‌టౌన్ బ్లిట్జ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | Khulna Titans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20 | Cumilla వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–present | యార్క్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020/21 | Hobart Hurricanes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | పంజాబ్ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021–present | Trent Rockets | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Comilla విక్టోరియాns | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 1 September 2023 |
డేవిడ్ జోహాన్నేస్ మలన్ (జననం 1987 సెప్టెంబరు 3) అన్ని ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయంగా ఆడే ఇంగ్లీష్ క్రికెటరు. దేశీయ క్రికెట్‌లో, అతను యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. గతంలో మిడిల్‌సెక్స్ తరపున ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సహా పలు ట్వంటీ20 లీగ్‌లలో ఆడాడు.
2017 లో మలన్, తన టెస్టు ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) రంగప్రవేశం చేసాడు. 2019లో తొలి వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) ఆడాడు.[1] 2020లో, ఐసిసి పురుషుల ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అతని రేటింగ్ 915కి చేరుకుంది, ఇది ఆ ఫార్మాట్‌లో రికార్డు.[2] అతను 2022 T20 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో సభ్యుడు.[3]
మలన్ ఎడమ చేతి టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా, అప్పుడప్పుడు లెగ్‌బ్రేక్ బౌలర్‌గా ఆడతాడు.[1] టీ20లో సెంచరీ సాధించిన నలుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లలో అతడు ఒకడు.[4]
మలన్ లండన్‌లోని రోహాంప్టన్‌లో జన్మించారు. ఏడు సంవత్సరాల వయస్సులో అతను, కుటుంబంతో సహా దక్షిణాఫ్రికా వెళ్లాడు.[5] అక్కడ అతను పార్ల్ బాలుర ఉన్నత పాఠశాలలో చదివాడు.[6] బోలాండ్ కోసం ఫస్టు క్లాస్ రంగప్రవేశం చేసిన కొద్దికాలానికే, అతను మిడిల్‌సెక్స్‌లో చేరి, అక్కడ ఒక దశాబ్దానికి పైగా ఉన్నాడు. అతను లివర్‌పూల్ FC మద్దతుదారు.
అతని తండ్రి, డేవిడ్ మలన్, సీనియర్, పశ్చిమ ప్రావిన్స్ B, నార్తర్న్ ట్రాన్స్‌వాల్ B, టెడ్డింగ్టన్‌లకు ఆడాడు. అతను కుడిచేతి వాటం బ్యాటరు, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలరు.[7] అతని సోదరుడు, చార్ల్ మలన్ కూడా లౌబరో MCCU కొరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అతని సోదరి లినే దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి.[8]
మలన్ ఎడమచేతి వాటం బ్యాటరు, అప్పుడప్పుడు లెగ్-స్పిన్ బౌలరు. అతను మొదట్లో దక్షిణాఫ్రికాలో బోలాండ్‌కు (2005/2006 సీజన్), 2006లో MCC యంగ్ క్రికెటర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2006 జూలై 7న మిడిల్‌సెక్స్‌లో చేరి, అదే రోజు ది ఓవల్‌లో సర్రేతో జరిగిన ట్వంటీ20 కప్ మ్యాచ్‌లో తన ఫస్ట్ XI టోర్నీ మ్యాచ్ ఆడాడు.
2007లో మలన్ సెకండ్ XI ఛాంపియన్‌షిప్‌లో 51.00 సగటుతో 969 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.[9] అతను 2008 జూన్లో మిడిల్‌సెక్స్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసి, 132 నాటౌట్ స్కోర్ చేశాడు.[10] 2008 జూలై 8న, మలన్ ట్వంటీ20 కప్ చరిత్రలో 24వ సెంచరీని కొట్టాడు, లంకాషైర్ లైట్నింగ్‌తో జరిగిన క్వార్టర్-ఫైనల్‌లో 54 బంతుల్లో 103 పరుగులు చేశాడు. దీంతో అతను T20 మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌లో సెంచరీ చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 2018 జూలై వరకు ఆ స్థానంలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు [11]
మలన్ 2013 నుండి 2 015 వరకు రెండు సీజన్లలో బంగ్లాదేశ్‌లోని ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ప్రైమ్ డోలేశ్వర్ స్పోర్టింగ్ క్లబ్ తరపున లిస్ట్-ఎ దేశవాళీ క్రికెట్ ఆడాడు. బ్యాటు, బాలూ రెండింటిలోనూ సహకారం అందించాడు.
మలన్ 2018 సీజన్ ప్రారంభానికి ముందు మూడు ఫార్మాట్లలో మిడిల్‌సెక్స్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.[12] 2019 సీజన్ తర్వాత వైదొలిగాడు. 2019 నవంబరులో, అతను 2020 సీజన్ నుండి యార్క్‌షైర్‌కు ఆడటానికి నాలుగు సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేశాడు. 2020 ఆగస్టులో, 2020 బాబ్ విల్లిస్ ట్రోఫీలో మూడో రౌండ్ మ్యాచ్‌లలో, మలన్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 219 పరుగులతో తన తొలి డబుల్ సెంచరీని సాధించాడు.[13]
2017 జూన్లో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ కోసం ఇంగ్లాండ్ ట్వంటీ20 అంతర్జాతీయ (టి20ఐ) జట్టులో మలన్ ఎంపికయ్యాడు.[14] 2017 జూన్ 25న జరిగిన తొలి మ్యాచ్లో అతను 78 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ మ్యాచ్ గెలుచుకుంది. మలన్ తన బ్యాటింగ్ ప్రదర్శనకు ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ' గా ఎంపికయ్యాడు.[15][16] దక్షిణాఫ్రికాతో జరిగిన మూడవ టెస్టుకు ముందు మలన్, ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. 2017 జూలై 27న 5వ స్థానంలో బ్యాటరుగా టెస్టు ప్రవేశం చేశాడు.[17] మొదటి ఇన్నింగ్సులో 1 పరుగు చేసి, రెండో ఇన్నింగ్సులో 10 పరుగులకే కగిసో రబాడా వేసిన యార్కరుకు బౌల్డ్ అయ్యాడు.[18] రెండవ టెస్టులో కూడా ఆకట్టుకోలేకపోయాడు. అతని టెస్టు భవిష్యత్తుపై ఈ ప్రదర్శనలు ప్రశ్నలు లేవనెత్తాయి.[19] అయితే వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో మలన్ తన స్థానాన్ని నిలుపుకుని, తొలి టెస్టులో 50 * పరుగులు చేసి ఇంగ్లాండ్ వారి తొలి పగటి-రాత్రి టెస్టులో విజయం సాధించడంలో సహాయపడ్డాడు.[20]
న్యూజిలాండ్ పర్యటన కోసం మలన్‌ను T20I జట్టులోకి తిరిగి తీసుకున్నారు. 2019 నవంబరు 8న నాల్గవ T20Iలో మలన్ తన మొదటి సెంచరీ సాధించాడు. కేవలం 48 బంతుల్లోనే చేసిన ఈ శతకం, ఓ ఇంగ్లండ్ బ్యాటరు చేసిన రెండవ వేగవంతమైనది.[21] అతను 2020 వేసవిలో పాకిస్తాన్, ఆస్ట్రేలియాలతో ఆరు T20Iలలో ఆడి, 213 పరుగులు చేశాడు. అతని ప్రదర్శనలతో 2020 సెప్టెంబరులో ICC T20I బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి చేరుకున్నాడు [22] ఈ ఫార్మాట్‌లో అతని మంచి ఫామ్ దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా కొనసాగింది. అక్కడ రెండు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' ప్రదర్శనల్లో - రెండవ, మూడవ T20Iలలో - 55, 99 నాటౌట్‌లతో అతను ICC ర్యాంకింగుల్లో అత్యధిక రేటింగుకు (915 పాయింట్లు) చేరుకున్నాడు.[23]
2019 మే 3న ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక మ్యాచ్ కోసం మలన్‌ను, ఇంగ్లండ్ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులోకి తీసుకున్నారు. మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరపున తన వన్‌డే రంగప్రవేశంలో 24 పరుగులు చేశాడు.[24]
2017 డిసెంబరులో WACAలో జరిగిన 3వ యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలకు మలన్ ఎంపికయ్యాడు. అక్కడ మలన్ తన మొదటి టెస్టు సెంచరీ సాధించాడు.[25] పర్యటనలో మలన్ టి20ఐలలో తన మంచి ఫామ్‌ను కొనసాగించాడు. ట్రాన్స్ - టాస్మన్ ట్రై - సిరీస్లో ఆడిన నాలుగు ఆటలలో మరో మూడు అర్ధ శతకాలను జోడించాడు. అయితే విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లను తిరిగి పిలిపించిన తర్వాత, జట్టులో స్థానాన్ని కోల్పోయాడు.[26] ఆ వేసవిలో పాకిస్తాన్తో జరిగిన రెండు టెస్టులకు, భారత్తో జరిగిన మొదటి టెస్టుకూ అతను తన స్థానాన్ని నిలుపుకున్నాడు గానీ పేలవమైన ఫామ్ కారణంగా తొలగించబడ్డాడు.[27]
2021 మార్చిలో, ఇంగ్లండ్ భారత పర్యటనలో, మలన్ 24 ఇన్నింగ్స్‌లలో T20Iలలో 1,000 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు.[28]
2021 ఆగస్టులో, భారత్‌తో జరిగే 2021 టెస్టు సిరీస్‌లో మూడో టెస్టు కోసం మలన్‌ని మళ్ళీ తీసుకున్నారు.[29][30] తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేశాడు.[31] మరుసటి నెలలో మలన్, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు.[32]
2022 జూన్లో, నెదర్లాండ్స్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో, మలన్ వన్‌డే క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. ఇంగ్లండ్ స్కోరు 498 పరుగులలో భాగంగా, అతను 125 పరుగులు చేశాడు. అది వన్డే చరిత్రలో అత్యధిక జట్టు స్కోరుకు రికార్డు.[33] ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌లతో పాటు ఇన్నింగ్స్‌లో ముగ్గురు సెంచరీలు సాధించిన వారిలో మలన్ ఒకడు.[34] హీథర్ నైట్, జోస్ బట్లర్ తర్వాత మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన మూడవ ఇంగ్లీష్ ఆటగాడిగా మలన్ నిలిచాడు; అతను తన తొలి వన్‌డే వికెట్‌ను కూడా తీశాడు, మూడు ఫార్మాట్‌లలో ఒక సెంచరీ, ఒక వికెట్ తీసిన మొదటి, ఏకైక ఇంగ్లీషు ఆటగాడిగా నిలిచాడు.
సంవత్సరం తరువాత, మలన్ 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో భాగమయ్యాడు. అతను గ్రూప్ దశలో మొత్తం 56 పరుగులు చేశాడు. కానీ చివరి గ్రూప్ గేమ్‌లో గాయపడి సెమీ-ఫైనల్, ఫైనల్‌లకు దూరమయ్యాడు.[35]
మలన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మొదటి సీజన్‌లో పెషావర్ జల్మీ తరపున ఆడాడు. తరువాతి సీజన్‌లో వారితోనే కొనసాగాడు. అందులో వారు లాహోర్‌లో ఆడిన ఫైనల్‌లో గెలిచారు. అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నాల్గవ సీజన్‌లో బారిసల్ బుల్స్ తరపున కూడా ఆడాడు.
2018 అక్టోబరులో, ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంట్ మొదటి ఎడిషన్ కోసం కేప్ టౌన్ బ్లిట్జ్ జట్టులో మలన్ ఎంపికయ్యాడు.[36][37] అదే నెల, అతను 2018-19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, ఖుల్నా టైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు.[38] 2019 నవంబరులో, అతను 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు.[39] 2020 అక్టోబరులో, లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కోసం జాఫ్నా స్టాలియన్స్ లో చేరాడు.[40]
2020 డిసెంబరులో మలన్, ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ లోకి ప్రవేడించాడు. హోబర్ట్ హరికేన్స్‌లో చేరాడు.[41]
2021 ఫిబ్రవరిలో, 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ముందు జరిగిన IPL వేలంలో మలన్‌ను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.[42] అయితే ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు.
మలన్ ది హండ్రెడ్ ప్రారంభ సీజన్ కోసం ట్రెంట్ రాకెట్స్‌లో చేరాడు..[43] 2022 ఏప్రిల్లో, అతను ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం ట్రెంట్ రాకెట్స్ కొనుగోలు చేసింది.[44]
మలన్ 2019 అక్టోబరు 17న క్లైర్ మోట్రామ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2022 జనవరి 15న మొదటి బిడ్డ - ఆడపిల్ల - పుట్టింది.
![]() 2021 లో మలన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | డేవిడ్ జోహాన్నెస్ మలన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రోహ్యాంప్టన్, లండన్, ఇంగ్లాండ్ | 1987 సెప్టెంబరు 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | Left-handed | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Right-arm leg break | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Top-order batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Charl Malan (brother) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 677) | 2017 27 July - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 14 January - Australia తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 254) | 2019 3 May - Ireland తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 6 March - Bangladesh తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 81) | 2017 25 June - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 1 September - New Zealand తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 29 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06 | Boland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006–2019 | Middlesex | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14–2014/15 | Prime Doleshwar Sporting Club | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017, 2019 | Peshawar Zalmi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | Barisal Bulls | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Cape Town Blitz | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | Khulna Titans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20 | Cumilla Warriors | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020 | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–present | Yorkshire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020/21 | Hobart Hurricanes | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | Punjab Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021–present | Trent Rockets | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Comilla Victorians | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 1 September 2023 |