డోర్నకల్, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలానికి చెందిన గ్రామం.[1] ఇది 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[2] విజయవాడ - వరంగల్ రైలుమార్గంలో ఒక ముఖ్య రైల్వే జంక్షను.
లోగడ డోర్నకల్ వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవెన్యూ డివిజనుకు చెందిన మండలం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో డోర్నకల్లు మండలాన్ని (1+12) పదమూడు గ్రామాలుతో చేర్చి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]
ఈ గ్రామంలో ఎనిమిది సంవత్సరాల ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం స్థాపించబడింది. ఈ మందిరం చాలా ప్రసిద్ధి పొందినది.