రకం | స్పోర్ట్స్ టెక్ |
---|---|
పరిశ్రమ | ఫాంటసీ క్రీడలు |
స్థాపన | 2008 |
స్థాపకుడు | హర్ష్ జైన్, భావిత్ శేత్ |
ప్రధాన కార్యాలయం | |
సేవ చేసే ప్రాంతము | ఇండియా |
ఉద్యోగుల సంఖ్య | 542 (ఆగస్టు 2020) |
డ్రీమ్11 అనేది భారతదేశానికి చెందిన ఫాంటసీ క్రీడల వేదిక. [1] ఇది వినియోగదారులకు క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ ఆటలను ఆడటానికి వీలు కల్పిస్తుంది.[2] [3] 2019 ఏప్రిల్ లో డ్రీమ్11, "యునికార్న్ క్లబ్" లోకి ప్రవేశించిన మొదటి భారతీయ గేమింగ్ సంస్థగా అవతరించింది.[4] డ్రీమ్11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 కు టైటిల్ స్పాన్సర్.
హర్ష్ జైన్, భావిత్ శేత్ కలిసి డ్రీమ్11 ను 2012 లో స్థాపించారు. [5][6] 2012 లో వారు క్రికెట్ అభిమానుల కోసం భారతదేశంలో ఫ్రీమియం ఫాంటసీ క్రీడలను ప్రవేశపెట్టారు. 2014 లో దీనిలో పది లక్షల వినియోగదారులు నమోదు చేసుకున్నారు. 2016 లో ఇది ఇరవై లక్షలకు, 2018 లో 40 లక్షలకూ పెరిగింది. ఇది ఫాంటసీ స్పోర్ట్స్ ట్రేడ్ అసోసియేషన్ (ఎఫ్.ఎస్.టి.ఎ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ గేమింగ్ (ఐ.ఎఫ్.ఎస్.జి) లో సభ్యత్వం పొందింది. ఏప్రిల్ 2019 లో స్టెడ్‌వ్యూ క్యాపిటల్, ఈ సంస్థలో తమ రెండవ పెట్టుబడి కార్యక్రమాన్ని పూర్తి చేసింది. స్టెడ్‌వ్యూ కాకుండా, డ్రీమ్ 11 పెట్టుబడిదారులలో కలారి క్యాపిటల్, థింక్ ఇన్వెస్ట్‌మెంట్స్, మల్టిపుల్స్ ఈక్విటీ, టెన్సెంట్ ఉన్నాయి.[7]
భారతదేశపు "గ్రేట్ మిడ్-సైజ్ వర్క్ ప్లేసెస్ - 2018" లో ఈ సంస్థ 9 వ స్థానంలో ఉంది. ఫాస్ట్ కంపెనీ, డ్రీమ్ 11 ను 2019 లో భారతదేశంలోని అగ్ర10 వినూత్న సంస్థలలో ఒకటిగా గుర్తించింది.
2017 లో ఈ కంపెనీపై ఒక భారతీయ హైకోర్టులో ఓ కేసు నమోదైంది. డ్రీమ్ 11 ఆట ఆడేవారికి మెరుగైన విజ్ఞానం, వివేచన, శ్రద్ధ ఉండాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది. అస్సాం, ఒడిశా, తెలంగాణ వంటి కొన్ని భారతీయ రాష్ట్రాల్లో ఫాంటసీ క్రీడలను చట్టం అనుమతించదు.[8] ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఆ పిటిషన్ ను కొట్టివేసింది.[9] ఈ తీర్పు సంస్థకు చట్టబద్ధతను అందించి, దేశవ్యాప్తంగా వారి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పించింది.[10]
డ్రీమ్ 11 క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, హాకీ, వాలీబాల్, బేస్ బాల్, హ్యాండ్‌బాల్ వంటి బహుళ క్రీడలకు ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. ఇది ఒక ఆన్ లైన్ ఆట ఇందులో వినియోగదారులు నిజ-జీవిత ఆటగాళ్ల యొక్క వర్చువల్ టీమ్ ని సృష్టించుకొని, ఈ ఆటగాళ్ల వాస్తవ మ్యాచ్ ల్లో ప్రదర్శనల ఆధారంగా పాయింట్లను సంపాదిస్తారు.[11] తమ పోటీలలో గరిష్ట పాయింట్లను సాధించిన వినియోగదారుడు లీడర్-బోర్డులో మొదటి ర్యాంకును పొందుతారు. డ్రీమ్ 11 ఉచిత, చెల్లింపు పోటీలను అందిస్తుంది. ఒక పోటీలో చేరడానికి వినియోగదారు కొంత రుసుము చెల్లించి, నిజమైన నగదును గెలుచుకోవచ్చు.[12] డ్రీమ్ 11 ఆటలో పాల్గొనడానికి, వినియోగదారు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వారి ప్రొఫైల్ ను పాన్ ఉపయోగించి ధృవీకరించుకోవాలి.
18 ఆగస్టు 2020 న డ్రీమ్11 ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను 222 కోట్ల రూపాయలకు గెలుచుకుంది.[13] 2019 మార్చిలో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ), డ్రీమ్11 ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అధికారిక భాగస్వామిగా ప్రకటించింది. ఐపీఎల్ 2019 నుండి నాలుగేళ్ల ప్రత్యేక భాగస్వామ్యం ప్రారంభమైంది. అదనంగా డ్రీమ్ 11 ద్వారా, ఐపిఎల్ యొక్క ‘అఫీషియల్ ఫాంటసీ గేమ్’ కూడా సమర్పించబడింది.
2018 లో, డ్రీమ్11 ఐసిసి (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్),[14] ప్రో కబడ్డీ లీగ్,[15] ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్.ఐ.హెచ్),[16] డబ్ల్యు.బి.బి.ఎల్, బి.బి.ఎల్[17] లతో తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా, డ్రీమ్11 వారి ప్లాట్‌ఫారమ్‌లో రెండు కొత్త ఆటలను (కబడ్డి, హాకీ) పరిచయం చేసింది.
2017 లో, ఈ సంస్థ క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్ లో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డ్రీమ్ 11 హీరో కరేబియన్ ప్రీమియర్ లీగ్, హీరో ఇండియన్ సూపర్ లీగ్, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) లకు అధికారిక ఫాంటసీ భాగస్వామి అయ్యింది.[18] కొద్ది రోజుల తరువాత, హీరో ఇండియన్ సూపర్ లీగ్ వారు తమ అధికారిక ఫాంటసీ ఫుట్ బాల్ భాగ్యస్వామిగా భాగస్వామ్యం పొందారు.[19] 2017 నవంబరులో, యు.ఎస్ ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లీగ్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) , డ్రీమ్11 తో కలిసి వారి వేదికమీద అధికారిక ఎన్‌బిఎ ఫాంటసీ గేమ్ ను ప్రారంభించింది.[20][21]
రిటైర్డ్ క్రికెటర్, మాజీ భారత-క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని డ్రీమ్ 11 యొక్క బ్రాండ్ అంబాసిడర్, ఇండియన్ ప్రీమియర్ లీగ్-2018 సందర్భంగా “డిమాగ్ సే ధోని” మీడియా ప్రచారాన్ని ప్రారంభించారు. [22] 2017 లో ఈ సంస్థ, వ్యాఖ్యాత హర్ష భోగ్లేను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.[23] ఐపిఎల్ 2019 కోసం, డ్రీమ్ 11 తన మల్టీ-ఛానల్ మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా ఏడుగురు క్రికెటర్లను నియమించింది, ఏడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలతో భాగస్వామ్యం కూడా పొందింది.
డ్రీమ్11 ఫౌండేషన్ ప్రజలకు తమ అవసరాల సమయంలో సాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల, డ్రీమ్ 11 ఫౌండేషన్ ఐ.ఎఫ్.ఎస్.జి, అథ్లెట్ సపోర్ట్ ప్రోగ్రాం, "స్టార్స్ ఆఫ్ టుమారో" కు మద్దతు ఇవ్వడానికి 3 సంవత్సరాల వ్యవధిలో రూ .3 కోట్లను ప్రతిజ్ఞ చేసింది.[24] భారతదేశ భవిష్యత్ క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి మద్దతు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. గోస్పోర్ట్స్ నేతృత్వం వహించిన ఎంపిక ప్రక్రియ ఫలితంగా, దేశవ్యాప్తంగా 168 మంది లో, 13 మంది అథ్లెట్లను ఐ.ఎఫ్.ఎస్.జి, "స్టార్స్ ఆఫ్ టుమారో" లో భాగంగా ఎంపికయ్యారు.[25] ఈ కార్యక్రమం కింద ఎంపికైన అథ్లెట్లకు వారి క్రీడా లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ఫౌండేషన్ సహాయపడుతుంది.
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)
{{cite web}}
: |last3=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: |last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)