తనుశ్రీ చక్రవర్తి | |
---|---|
జననం | 1984, ఆగస్టు 6 |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | ప్రియదర్శిని |
వృత్తి | మోడల్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010-ప్రస్తుతం |
తనుశ్రీ చక్రవర్తి (జననం 6 ఆగస్టు 1984) బెంగాలీ మోడల్, సినిమా, టివీ నటి.[1][2][3] జీ బంగ్లా ఛానల్‌లో సంపూర్ణ అనే అందం, జీవనశైలికి సంబంధించిన కార్యక్రమం నిర్వహించింది. తనుశ్రీ చక్రవర్తి 2021లో భారతీయ జనతా పార్టీలో చేరింది,[4][5] 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో శ్యాంపూర్ స్థానం నుండి పోటీచేసి ఓడిపోయింది.[6][7]
తనుశ్రీ 1984, ఆగస్టు 6న పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో జన్మించింది. కమలా బాలికల ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయం పరిధిలోని బసంతీ దేవి కళాశాలలో పొలిటికల్ సైన్స్ పూర్తిచేసింది.[8]
చదువు పూర్తయ్యాక మోడల్‌గా పనిచేసింది. అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. ప్రాణ్ పౌడర్ స్పైస్ వాణిజ్య ప్రకటనలో నటించి ప్రసిద్ధి పొందింది.
2011లో వచ్చిన ఊరో చితి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.[8] బెడ్‌రూమ్ (2012), ఒబిషోప్తో నైటీ (2014), విండో కనెక్షన్స్ (2014), బునో హాన్ష్ (2014) మొదలైన బెంగాలీ సినిమాలలో నటించింది.