తనూజ్ విర్వాణి | |
---|---|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | రతి అగ్నిహోత్రి, అనిల్ విర్వాణి |
తనూజ్ విర్వాణి భారతీయ నటుడు. అంతేకాకుండా ఆయన బాలీవుడ్ పరిశ్రమలో చురుకుగా ఉన్న మోడల్. ఆయన 2017 అమెజాన్ ఒరిజినల్ టెలివిజన్ సిరీస్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌లో వాయు రాఘవన్ పాత్రకు బాగా పేరు పొందాడు. ఆయన ఆల్ట్ బాలాజీ కోడ్ ఎం లో జెన్నిఫర్ వింగెట్ సరసన, జీ5 అత్యంత విజయవంతమైన షో పాయిజన్‌లో కూడా సమగ్ర పాత్రలు ఆయన పోషించాడు. ఆయన రేసీ థ్రిల్లర్ వన్ నైట్ స్టాండ్‌లో సన్నీ లియోన్ సరసన నటించాడు. ఆయన నటుడిగానే కాకుండా దర్శకత్వం, రచన పట్ల కూడా ఆసక్తిని కనబరిచాడు. అనేక లఘు చిత్రాలను సామాజిక అంశాలపై తీశాడు. ఆయన ప్రముఖ వెబ్ సిరీస్ ఇల్లీగల్ ఆఫ్ వూట్ సెలెక్ట్ రెండవ సీజన్‌లో కూడా ఉన్నాడు.
ఆయన నటి రతీ అగ్నిహోత్రి కుమారుడు.[1] జో రాజన్ దర్శకత్వం వహించిన 2013లో లవ్ యు సోనియో(Luv U Soniyo) అనే హిందీ చిత్రంతో ఆయన బాలీవుడ్ అరంగేట్రం చేసాడు.[2] ఆ తర్వాత ఆయన తనుశ్రీ ఛటర్జీ బసు దర్శకత్వం వహించిన 2014 చలనచిత్రం పురాణి జీన్స్‌లో ఇజాబెల్లె లైట్, ఆదిత్య సీల్ సరసన నటించాడు.
ఆయన జాస్మిన్ మోసెస్ డిసౌజా వన్ నైట్ స్టాండ్(2016)లో సన్నీ లియోన్ సరసన నటించాడు.[3] 2017లో అమెజాన్ సిరీస్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌లో,[4] సెలబ్రిటీ రియాలిటీ టీవీ షో బాక్స్ క్రికెట్ లీగ్‌లో ఆలరించాడు.[5]
ఆయన అదే సంవత్సరం ఎమ్మీ నామినేట్ చేయబడిన సిరీస్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌తో డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతను జీ5 ఒరిజినల్ పాయిజన్‌తో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆయన ఆల్ట్ బాలాజీ కోడ్ ఎం లో జెన్నిఫర్ వింగెట్ సరసన నటించాడు. ఆయన మీరా చోప్రా సరసన డిస్నీ+ హాట్‌స్టార్ ఒరిజినల్ ది టాటూ మర్డర్స్‌లో డాన్ పాత్రను కూడా పోషించాడు. 2021లో ఆయన డిస్నీ+ హాట్‌స్టార్‌లో కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో బర్ఖా సింగ్ కి జోడీగా మర్డర్ మేరీ జాన్‌లో నటించాడు. అదే సంవత్సరంలో, నివేదిత బసు క్రైమ్ థ్రిల్లర్ తాండూర్‌లో సాహిల్ శర్మ ప్రతికూల పాత్రను పోషించడానికి అతను రష్మీ దేశాయ్ సరసన జతకట్టాడు.