తన్మయ్ అగర్వాల్

తన్మయ్ అగర్వాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
తన్మయ్ ధరంచంద్ అగర్వాల్
పుట్టిన తేదీ (1995-05-03) 1995 మే 3 (వయసు 29)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగులెగ్ బ్రేక్ గూగ్లీ
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులునితిషా జలన్ అగర్వాల్ (భార్య)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014–ప్రస్తుతంహైదరాబాదు
2017–ప్రస్తుతంసన్ రైజర్స్ హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్టు-ఏ ట్వంటీ20
మ్యాచ్‌లు 42 29 40
చేసిన పరుగులు 2,609 1,084 1,087
బ్యాటింగు సగటు 37.81 40.14 28.60
100s/50s 8/10 2/8 0/5
అత్యధిక స్కోరు 135 136 91
వేసిన బంతులు 70 6
వికెట్లు 0 1
బౌలింగు సగటు 1.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/1
క్యాచ్‌లు/స్టంపింగులు 19/– 12/– 11/–
మూలం: Cricinfo, 2020 మే 6

తన్మయ్ ధరంచంద్ అగర్వాల్, తెలంగాణకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. హైదరాబాదు తరపున ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన తన్మయ్ అండర్-14, అండర్-16, అండర్-19, అండర్-22, అండర్-25 వంటి వివిధ ఏజ్-గ్రూప్ స్థాయిలలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014లో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లలోనే రెండింటిలోనూ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.[1][2]

2017 ఫిబ్రవలో 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన్మయ్ ను 10 లక్షలకు కొనుగోలు చేసింది.[3] 2018 జనవరిలో, 2018 ఐపిఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.[4]

జననం

[మార్చు]

తన్మయ్ అగర్వాల్ 1995 మే 3న తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

ఫస్ట్-క్లాస్

[మార్చు]

2014, డిసెంబరు 14 నుండి 17 వరకు హైదరాబాదులో గోవా క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[5] 42 మ్యాచ్‌ల్లో 37.81 బ్యాటింగ్ సగటుతో 2,609 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 10 అర్థసెంచరీలు ఉన్నాయి. 135 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు.

లిస్టు-ఎ

[మార్చు]

2014, నవంబరు 11న హైదరాబాదులో కర్ణాటక క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో లిస్టు-ఎ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[6] 29 మ్యాచ్‌ల్లో 40.14 బ్యాటింగ్ సగటుతో 1,084 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్థసెంచరీలు ఉన్నాయి. 136 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు.

ట్వంటీ20

[మార్చు]

2015, మార్చి 25న కొచ్చిలో తమిళనాడు క్రికెట్ జట్టుతో జరిగిన మ్యాచ్ తో ట్వంటీ20 క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[7] 40 మ్యాచ్‌ల్లో 28.60 బ్యాటింగ్ సగటుతో 1,087 పరుగులు చేశాడు. ఇందులో 5 అర్థసెంచరీలు ఉన్నాయి. 91 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Tanmay Agarwal". ESPNcricinfo. Retrieved మార్చి 26 2015. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "Tanmay slams a ton on debut". www.thehindu.com. The Hindu. Archived from the original on 2021-11-23. Retrieved మార్చి 26 2015. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "List of players sold and unsold at IPL auction 2017". ESPN Cricinfo. Retrieved ఫిబ్రవరి 20 2017. {{cite web}}: Check date values in: |access-date= (help)
  4. "List of sold and unsold players". ESPN Cricinfo. Archived from the original on 2022-07-11. Retrieved జనవరి 27 2018. {{cite web}}: Check date values in: |access-date= (help)
  5. "Full Scorecard of Hyderabad vs Goa Group C 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-08-06. Retrieved 2022-09-14.
  6. "Full Scorecard of Hyderabad vs Karnataka South Zone 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2022-09-14. Retrieved 2022-09-14.
  7. "Full Scorecard of Tamil Nadu vs Hyderabad South Zone 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Archived from the original on 2021-06-23. Retrieved 2022-09-14.

బయటి లింకులు

[మార్చు]