వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | తబ్రైజ్ షమ్సీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జోహన్నెస్‌బర్గ్, ట్రాంస్‌వాల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | 1990 ఫిబ్రవరి 18|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | Left-arm unorthodox spin | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 328) | 2016 నవంబరు 24 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2018 జూలై 12 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 116) | 2016 జూన్ 7 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 ఏప్రిల్ 2 - నెదర్లాండ్స్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 72) | 2017 జూన్ 21 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009–2010 | Gauteng | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | Highveld Lions | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | క్వాజులు-నాటల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010–2014 | డాల్ఫిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2014 | క్వాజులు-నాటల్ Inland | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–present | Easterns | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014–present | Titans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015–2017 | St Kitts and Nevis Patriots | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2018 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | నార్తాంప్టన్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | హాంప్‌షైర్ (స్క్వాడ్ నం. 90) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | రాజస్థాన్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | గయానా Amazon వారియర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Paarl Royals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Karachi Kings | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Galle Titans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 31 March 2023 |
తబ్రైజ్ షమ్సీ (జననం 1990 ఫిబ్రవరి 18) [1] దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. అతను డాల్ఫిన్స్, గౌటెంగ్, గౌటెంగ్ అండర్-19, క్వాజులు నాటల్, క్వాజులు-నాటల్ ఇన్‌ల్యాండ్, లయన్స్, టైటాన్స్ జట్ల తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అతను కుడిచేతి వాటం బ్యాటింగ్ శైలికి, ఎడమ చేతి అనార్థడాక్స్ స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. [1]
షమ్సీ హైస్కూల్‌లో ఉన్నప్పుడు స్కూల్ క్రికెట్ పోటీల్లో ఫ్రంట్‌లైన్ సీమ్ బౌలర్‌గా ఆడాడు. అయితే, అండర్-19 జట్టు కోసం ట్రయల్స్‌కు వెళ్ళినప్పుడు సీమ్ బౌలరుకు ఉండాల్సినంత వేగం అతనిలో లేదని కోచ్‌లు అతనికి చెప్పారు. అతను చాలా కట్టర్‌లను బౌలింగ్ చేశాడు కాబట్టి, స్పిన్ బౌలర్‌గా మారమని సూచించారు. [2]
2018 జూన్‌లో షమ్సీ, 2018-19 సీజన్‌లో టైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [3] 2018 అక్టోబరులో, అతను ఎంజాన్సి సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషన్ కోసం పార్ల్ రాక్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [4] [5] అతను టోర్నమెంట్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో పది అవుట్‌లతో జట్టుకు సంయుక్తంగా అత్యధిక వికెట్-టేకర్‌గా నిలిచాడు.[6]
2016 ఏప్రిల్లో షమ్సీ, 2016 IPL సమయంలో గాయపడిన శామ్యూల్ బద్రీ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రంగప్రవేశం చేసి, రాయల్ ఛాలెంజర్స్ తరఫున 4 ఓవర్లలో 1/36 తీసుకున్నాడు. దీంతో ఆ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. [7]
2017 ఆగస్టులో, T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం స్టెల్లెన్‌బోష్ మోనార్క్స్ జట్టులో షమ్సీ ఎంపికయ్యాడు. [8] అయితే 2017 అక్టోబరులో క్రికెట్ దక్షిణాఫ్రికా, మొదట్లో ఆ టోర్నమెంట్‌ను నవంబరు 2018కి వాయిదా వేసి, ఆ తర్వాత వెంటనే రద్దు చేసింది. [9]
షమ్సీ 2017–18 రామ్ స్లామ్ T20 ఛాలెంజ్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. టోర్నమెంటులో మొత్తం 11 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసుకున్నాడు.[10] అతను 2017–18 మొమెంటమ్ వన్ డే కప్‌లో 9 మ్యాచ్‌లలో 26 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.[11]
2019 సెప్టెంబరులో 2019 ఎంజాన్సి సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పార్ల్ రాక్స్ జట్టు కోసం జట్టులో ఎంపికయ్యాడు. [12] 2020 జూలైలో, అతను 2020 కరీబియన్ ప్రీమియర్ లీగ్ కోసం జమైకా తల్లావాస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. [13] [14] అయితే, సరైన సమయంలో ప్రయాణ ఏర్పాట్లు చేసుకోనందున ఆ టోర్నమెంటుకు దూరమైన ఐదుగురు దక్షిణాఫ్రికా క్రికెటర్లలో షమ్సీ ఒకడు. [15]
2019 జూలైలో షమ్సీ, యూరో T20 స్లామ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్‌లో ఎడిన్‌బర్గ్ రాక్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [16] [17] అయితే, మరుసటి నెలలో ఆ టోర్నీని రద్దు చేసారు. [18] 2019 వైటాలిటీ బ్లాస్టు సమయంలో మాసన్ క్రేన్, బ్రాడ్ టేలర్‌లకు గాయాలవడంతో చివరి నాలుగు గ్రూప్ దశ మ్యాచ్‌ల కోసం హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు సంతకం చేశాడు. [19]
2020 నవంబరులో, 2020–21 CSA 4-రోజుల ఫ్రాంచైజీ సిరీస్ రెండో రౌండ్‌లో షమ్సీ, వారియర్స్‌పై రెండవ ఇన్నింగ్స్‌లో 32 పరుగులకు ఎనిమిది వికెట్లు పడగొట్టి, ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లో టైటాన్స్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. [20]
2021 ఏప్రిల్లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు షమ్సీ నార్తర్న్స్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [21] 2021 ఆగస్టు 25న, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే 2021 IPL రెండవ దశ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆండ్రూ టై స్థానంలో షమ్సీని చేర్చారు. [22] 2021 నవంబరులో, అతను 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్ తర్వాత గాలే గ్లాడియేటర్స్ కోసం ఆడేందుకు ఎంపికయ్యాడు. [23]
2016 మేలో, మరుసటి నెలలో ప్రారంభమైన 2016 వెస్టిండీస్ ట్రై-సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టులో షమ్సీ ఎంపికయ్యాడు. [24] అతను 2016 జూన్ 7న ఆస్ట్రేలియాతో జరిగిన టోర్నమెంట్‌లో తన వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) రంగప్రవేశం చేసాడు. [25]
షమ్సీ 2016 నవంబరు 24న ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా తరపున తన తొలి టెస్టు ఆడాడు.[26] నాథన్ లియాన్ అతని తొలి టెస్టు వికెట్.
షమ్సీ 2017 జూన్ 21న ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) ప్రవేశం చేశాడు [27]
2019 ఏప్రిల్లో, 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మంది దక్షిణాఫ్రికా జట్టులో షామ్జీ ఎంపికయ్యాడు. [28] [29] 2019లో వన్డే క్రికెట్ నుండి వెటరన్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ రిటైర్మెంట్ తర్వాత, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకు షమ్సీ మొదటి ఎంపిక స్పిన్నర్‌గా అవతరించాడు. [30] [31] [32]
2021 మార్చిలో, పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల T20I సిరీస్‌లో 6 వికెట్లు తీయడం ద్వారా షమ్సీ తన కెరీర్‌లో మొదటిసారిగా ICC T20I బౌలర్ల ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచాడు. [33] [34] 2021 సెప్టెంబరులో, శ్రీలంకతో జరిగిన రెండవ మ్యాచ్‌లో, షమ్సీ వన్‌డేలలో తన మొదటి ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు. [35] అదే నెలలో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో షమ్సీ ఎంపికయ్యాడు. [36]
2022 జూలై 31న, సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు-మ్యాచ్‌ల T20I సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో, షమ్సీ తన నాలుగు ఓవర్లలో 5/24 వికెట్లను సాధించి, టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున ఐదు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. అతని నాల్గవ వికెట్ టి20ల్లో అతనికి 65వది. దాంతో, టి20ల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్ స్టెయిన్‌ను అధిగమించాడు.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)