తర్ల | |
---|---|
దర్శకత్వం | పీయూష్ గుప్తా |
రచన | పీయూష్ గుప్తా గౌతమ్ వేద్ |
నిర్మాత | రోనీ స్క్రూవాలా, అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాలు కె. థామస్ |
కూర్పు | గౌరవ్ అగర్వాల్ |
సంగీతం | నీలోత్పల్ బోరా సుహిత్ అభ్యంకర్ రోహన్ వినాయక్ |
నిర్మాణ సంస్థ | ఎర్త్ స్కై పిక్చర్స్ |
పంపిణీదార్లు | జీ5 |
విడుదల తేదీ | 7 జూలై 2023 |
సినిమా నిడివి | 127 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
తర్ల సినిమా 2023 సంవత్సరంలో విడుదలైన హిందీ భాషా బయోపిక్. ఈ సినిమా భారతీయ చెఫ్, కుక్‌బుక్ రచయిత అయిన తర్ల దలాల్ జీవితానికి సంబంధించినది. ఇందులో హుమా ఖురేషి నటించింది.[1][2][3] ఈ చిత్రానికి పియూష్ గుప్తా దర్శకత్వం వహించాడు. దీనిని రోనీ స్క్రూవాలా, అశ్వినీ అయ్యర్ తివారీ, నితేష్ తివారీ నిర్మించారు.[4][5] ఈ చిత్రం జీ5 లో విడుదలైంది.[6][7]
తర్ల తన జీవితంలో ఏదైనా ముఖ్యమైనదాన్ని సాధించాలని కోరుకునే మహిళ, కానీ ఆమె కుటుంబం ఆమెకు వివాహం చేయాలని పట్టుబడుతుంది. తర్ల భర్త నళిన్ ఆమెకు అండగా నిలబడతాడు. ఆమె భర్త నళిన్ స్వచ్చమైన శాకాహారి అయినప్పటికీ అతనికి మాంసాహారం అంటే విపరీతమైన ఇష్టం. దానితో ఆమె మాంసాహారాన్ని అనుసరించి శాకాహార వంటకాలను తయారు చేయడం ప్రారంభించింది, ఆమె తన పక్కింటి పిల్లవాడికి వంట నేర్పించిన తరువాత, అందరికి వంట క్లాసులు తీసుకోవడం ప్రారంభించింది, ఆ తరువాత ఆమె వంట ప్రపంచంలో ఎలా విప్లవాత్మకతను తీసుకొచ్చింది అన్నది అసలు కథ.