తాతమ్మకల (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నందమూరి తారక రామారావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, భానుమతి, మాష్టర్ నందమూరి బాలకృష్ణ రాజబాబు చలపతిరావు |
సంగీతం | ఎస్. రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | రామకృష్ణ ఆర్ట్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 29, 1974 |
భాష | తెలుగు |
తాతమ్మకల నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో 1974, ఆగస్టు 30న విడుదలైన కళాకండం.[1] ఈ చిత్రం ఆనాటి పల్లేటూరి అమాయకత్వానికి పట్టణం పొకడకి మధ్య గల తేడాను చూపిన చిత్రం. నందమూరి బాలకృష్ణ మొదటి సినిమా బాల నటుడిగా.
రావమ్మ (భానుమతి) ఊరి కోసం ఎదేనా చేయ్యలి అని తాపత్రయం పడుతుంది. కొడుకు కొడలు చనిపొతారు వారికి పుట్టిన బిడ్డను రావమ్మ మనుమడు (నందమూరి తారక రామారావు) ను పెంచి పెద్దచేస్తుంది. పెళ్ళి చేస్తుంది మనుమడికి ఐదుగురు సంతానం కుటుంబ కర్చులు పెరగడంతొ కొంత భూమిని అమ్మి అప్పులు తీరుస్తాడు. డబ్బు సంపాదన కోసం అని పట్నం చేరతాడు. ఒక వ్యాపారిని కాపాడి అతని వద్ద గుమస్తాగా పనికి కుదురుతాడూ పిల్లలు పెరిగి పెద్దవారు అవుతారు. ఇక్కడ దర్శకుడు ఆ రోజులలో గల ఒక ఐదు సమస్యలను కథలోకి చొప్పించారు.
ఉరి పెద్దలు వ్యతిరేకిస్తున్న యువకులతొ కలసి నీటి వసతి లేని ఆ గ్రామానికి రిగ్గింగుతో బొరు బావిని వేసి అత్యంత అదునిక పద్ధతిలో వ్యవసాయం చెసి నేలలో బంగారం పండిస్తాడు. రాష్ట్రపతి బహుమతి సాదించి ఆ ఊరికి మంచి పేరు తిసుకువస్తాడు.
సినిమా తీసేనాటికి కుటుంబ నియంత్రణపై విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ముద్దు, ఆపై వద్దు అంటూ సాగుతున్న ఈ ప్రచారానికి వ్యతిరేకమైన సందేశంతో ఈ సినిమాను తీశారు.[2][3]
"నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన