ఆరోహణ | S R₁ G₁ M₁ P D₃ N₃ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₃ D₃ P M₁ G₁ R₁ S |
తానరూపి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 6వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "తనుకీర్తి" అని పిలుస్తారు. [2][3] ఇందు చక్రంలో ఇది మొదటి రాగం.[4] దీని ధారణానుకూలమైన పేరు "ఇందు-షా"
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, షట్చ్రుతి ధైవతం, కాకళి నిషాధం. ఇది 42 మేళకర్త రఘుప్రియ రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
చాలామంది వాగ్గేయకారులు తానరూపి రాగంలో కీర్తనల్ని రచించారు.
తానరూపి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]