తారాబాయి మోడక్
| |
---|---|
![]() దహను (మహారాష్ట్ర) సమీపంలో కోస్బాద్ కొండపై తారాబాయి మోదక విగ్రహం
| |
జననం | 1892 బొంబాయి
|
మరణం | 1973 |
వృత్తి | సామాజిక కార్యకర్త |
ప్రసిద్ధి | ప్రీస్కూల్ విద్య (బాల్వాడీలు) |
పురస్కారాలు | పద్మభూషణ్ 1962 |
తారాబాయి మోడక్ (1892 ఏప్రిల్ 19 -1973) బొంబాయి లో జన్మించింది.[1] ఆమె 1914లో ముంబై విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైంది. ఆమె అమరావతి కి చెందిన న్యాయవాది శ్రీ మోదక్ ను వివాహం చేసుకుంది. తరువాత 1921లో ఆమె విడాకులు తీసుకుంది.
ఆమె రాజ్‌కోట్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసింది.మహారాష్ట్ర విదర్భ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త కావడంతో, బాల్వాడిలను మొదట ఆమె అభివృద్ధి చేసింది. మొదటి బాల్వాడిని మహారాష్ట్ర థానే జిల్లా బోర్డిలో నూతన్ బాల్ శిక్షణ్ సంఘ్ ప్రారంభించింది.[2][3]ప్రీస్కూల్ విద్య ఆమె చేసిన కృషికి 1962లో ఆమెకు పద్మభూషణ్ లభించింది.[4] అనుతై వాఘ్ ఆమె శిష్యురాలు.[5]ఆమె భారత జాతీయ కాంగ్రెస్ సభ్యురాలు. .[6]
ఆమె జీవితం ఆధారంగా రత్నాకర్ మట్కరీ నిర్మించిన ఘర్ తిగాంచా హవా అనే నాటకం.[7]