తాళి (సినిమా)

తాళి
(1997 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
తారాగణం శ్రీకాంత్,
రాజేంద్రప్రసాద్
సంగీతం కోటి
నిర్మాణ సంస్థ ఎం.ఆర్.సి.మూవీ క్రియెషన్స్
భాష తెలుగు

తాళి 1997లో వచ్చిన సినిమా. దీనిని మాగంటి వెంకటేశ్వర రావు MRC మూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ [1] క్రింద నిర్మించాడు. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో శ్రీకాంత్, శ్వేత, స్నేహ, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు.[3] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.[4]

బోసు బాబు (శ్రీకాంత్) పై ఒక గ్రామంలోని ధనవంతుడు. అతని ప్రత్యర్థి కోటా (కోట శ్రీనివాసరావు) కు ఇతడు కొరకరాని కొయ్య. కాబట్టి, అతని అడ్డు తొలగించుకోవటానికి, కోటా తన కుమార్తె స్వాతి (స్వాతి) కి బోసు బాబుతో పెళ్ళి చేయాలని అనుకుంటాడు. ఆ సమయంలో, బోస్ బాబుకు అతడి తండ్రి సన్నిహితుడు రామరాజు (మురళి మోహన్) కుమార్తె స్నేహ (స్నేహ) తో సంబంధం కుదిరిపోయిందని అతనికి తెలుసు. బోస్ బాబు రహస్యంగా రామరాజు ఇంటికి వెళ్లి, అక్కడున్న అతడి పెంపుడు కుమార్తె గంగ (శ్వేత) ను తనకు కాబోయే భార్య అని తప్పుగా అర్థం చేసుకుంటాడు.. తన వివాహం గురించి తెలుసుకున్న స్నేహ దాన్ని తిరస్కరిస్తుంది. కోపంగా ఉన్న రామరాజు ఆమెకు బోస్ బాబుతో బలవంతంగా పెళ్ళి చేస్తాడు. ఆ తరువాత, స్నేహ తాళిని తీసివేసి పారిపోతుంది. అది చూసి రామరాజు కుపకూలిపోతాడు. దానిని గుర్తించి, అతడి నమ్మకమైన సేవకుడు రాము (రాజేంద్ర ప్రసాద్) గంగకు ఆ తాళి ఇచ్చి, ఆమెను బోస్ బాబు నివాసంలో దించుతాడు. కోలుకున్న వెంటనే రాము, స్నేహ అత్తగారింట్లో సురక్షితంగా ఉందని రామరాజును మభ్యపెడతాడు

ఇంతలో, శివాజీ మోసగాడని స్నేహ తెలుసుకుంటుంది. అదే సమయంలో, గ్రామంలో, బోస్ బాబు గంగకు సన్నిహిత్ంగా మెసలడాణికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె అతన్ని పట్టించుకోదు. అకస్మాత్తుగా, ఒక రోజు, రామరాజు గ్రామానికి చేరుకుని, నిజం తెలుసుకుంటాడు. గంగను బోసుకు అధికారిక భార్యగా ప్రకటిస్తాడు. ఆ తరువాత, బోస్ బాబు & గంగా వారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఆమె గర్భవతి అవుతుంది. బోస్ బాబు స్నేహతో కలిసి వచి ఆమెను తన భార్యగా చెబుతాడు. అక్కడి నుండి కథ మలుపులు తిరిగి క్లైమాక్సుకు చేరుతుంది.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఏమైందో ఏమోనమ్మా"సిరివెన్నెల సీతారామశాస్త్రిచిత్ర, హరిహరన్5:20
2."పాపా నిన్నే పట్టుకోనా"షణ్ముఖ శర్మఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర5:02
3."ఉల్లె ఉలేలే"షణ్ముఖ శర్మఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:50
4."గుప్పు గుప్పు గుప్పుమంది"సిరివెన్నెల సీతారామశాస్త్రిమనో, స్వర్ణలత4:40
5."ముద్దుగుమ్మలిద్దరూ"సిరివెన్నెల సీతారామశాస్త్రిగంగాధర్, సుజాత4:10
6."గుంతలకడి గుమ్మాడి"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత5:12
7."ఓసోసి కన్నె శశి"శ్హణ్ముఖ శర్మఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర4:40
మొత్తం నిడివి:33:54

మూలాలు

[మార్చు]
  1. "Thaali (Banner)". Chitr.com. Archived from the original on 2021-02-28. Retrieved 2020-08-30.
  2. "Thaali (Direction)". Spicy Onion.
  3. "Thaali (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2021-03-07. Retrieved 2020-08-30.
  4. "Thaali (Review)". Know Your Films.