తిరువాట్టార్

తిరువాట్టర్
నగరం
తిరువట్టర్ సమీపంలో అయ్యవాజీ తంగల్
తిరువట్టర్ సమీపంలో అయ్యవాజీ తంగల్
దేశం India
రాష్ట్రంతమిళనాడు
జిల్లాకన్యూకుమారి
Government
 • ??
Elevation
13 మీ (43 అ.)
జనాభా
 (2001)
 • Total18,404
Languages
 • OfficialTamil
 • SpokenTamil, Malayalam
Time zoneUTC+5:30 (IST)
PIN
629 177
Telephone code91-4651
Vehicle registrationTN-75

తిరువట్టారు: 38 కి. మీ.  శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ఆది ధర్మ స్థలం, దక్షిణ వైకుంఠమ్, పరశురామ క్షేత్రము. 

ఇచ్చట పెరుమాళ్ పశ్చిమ ముగము గాని ఆలయ ప్రవేశము తూర్పు ముగము. స్వామి విగ్రహము చాలా పెద్దది అందువలన ఈ పెరుమాళ్ ని కూడా మూడు ద్వారబందముల ద్వారా దర్శనం. ఇక్కడ శివ లింగం  పెరుమాళ్ తిరువాడికి సమీపములో ఉన్నది. అనంతపద్మనాధుడు పెరుమాళ్ తిరుముగం సమీపము లో ఉన్నది. పద్మనాభుడు నాభి లోంచి ఉద్భవించిన బ్రహ్మ ఈ తిరువట్టార్ పెరుమాళ్ కి లేడు.  నాభి స్థానములో నిలువెత్తు శ్రీదేవి భూదేవి విగ్రహములు దర్శనమిస్తాయి. అనంత పద్మనాభుడు వీరికి తమ్ముడు అని ఇక్కడి వారి అభిప్రాయము. సన్నిధి కూడా తిరువనంతపురములో లాగే ఉంటుంది. గర్భాలయమునకు  ముందు ఉండే మండపమునకు ఉదయ మార్తాండ మండపము అని పేరు. ఈ మండపములో వేణుగోపాలుడు, చతుర్ముఖుడు, నమ్మాళ్వార్ ఆరు అడుగుల విగ్రహములు దర్శనము.  ఇక్కడ సూర్యాస్తమయమున సూర్యుని కిరాణాలు స్వామి తిరుముగం ను తాకును. చంద్రోదయం తో చంద్రుడు స్వామి దర్శనం చేసుకొనును. 

స్థలపురాణం: ఒకప్పుడు బ్రహ్మ ఈ ప్రాంతములో యజ్ఞము తలపెట్టారు. ఈ విషయము సరస్వతి దేవికి చెప్పలేదు. దానితో ఆమెకు కోపము వచ్చింది. ఋత్వికులు మంత్రాలు ఉచ్చరిస్తుండగా స్వరస్వతి దేవి వారి మంత్రోచ్ఛారణ లో తప్పిదములు వచ్చినట్ట్లు చేయగ, యజ్ఞం  నుండి యజ్ఞ పురుషుని బదులు  కేసు, కేసి అనే రాక్షషులు పుట్టారు. వీరు లోకాలను పీడించ సాగారు. యజ్ఞ గుండము నుండి పుట్టినందువల్ల వారిని ఎవ్వరూ సంహరించలేకపోయినారు. విధాత శ్రీమన్నారాయణుని ప్రార్ధించాడు. పెరుమాళ్ ఇక్కడ కేసు అనే బ్రహ్మరాక్షసుడినితో ఏడు దినములు యుద్ధము చేసెను. కేశు వధించబడలేదు. శ్రీమన్నారాయణునికి కోపము వచ్చి కేశును మహేంద్రగిరి నుండి విసిరి వేసి వాని గుండెలు పగిలేలా పాంచజన్యమును పూరించాడు. వాడు ఆ ధ్వనికి వెంటనే లేవలేకపోయాడు. ఇది ఆదిశేషుడు గమనించి వానిని తన శరీరముతో చుట్టివేసేను. శ్రీమన్నారాయణుడు ఆదిశేషునిపై శయనించేను.   కేసు చెల్లెలు కేసి ఇది గమనించి తన స్నేహితురాలితో కలసి నదులుగా మారి పెను ప్రళయముగా వచ్చి ముంపునకు గురి చేయును. అప్పుడు పెరుమాళ్ భూదేవిని తన స్థలమును పైకి లేపమని ఆదేశించేను. పెరుమాళ్ కోపగించి కెశిని నది గానే ఇచ్చట ఉండమని శపించేను. అందువలన ఈ రెండు నదులు కోవిల చుట్టూ పెరుమాళ్ ని మ్రొక్కుతూ వెళ్తున్నట్టు వెళ్ళును. గాని పెరుమాళ్ ని నీట ముంచ లేక పోయినవి   కానీ అది కేసు శారీరమును నీరు తాకడము వలన రాక్షసుడు మోక్షము పొందెను అందుకే ఈ పెరుమాళ్ ని ఆది కేశవ పెరుమాళ్ అని పేరు. ఈ స్వామి తిరువనంతపుర రాజులకు ఇష్ట దైవము. పూర్వము వీరు 1200 కేజీల ప్రసాదము నైవేధ్యముగా ప్రతి నిత్యము పెరుమాళ్ కి సమర్పించేవారుట కానీ ఇప్పుడు ఆ వైభోఘము మనకి కనిపించదు. తైల దీపాల వెలుగులో స్వామి అద్భుతముగా దర్శిస్తారు. 

తీర్థవారి, పుష్పాంజలి  ఉత్సవములు  వైభవము గా ఇక్కడ జరుగును.

మూలవర్ : ఆదికేశవ పెరుమాళ్ కీడాంత తిరుక్కోలామ్, (భుజంగ శయన సేవ) తిరుముగం: పశ్చిమము,

తాయార్; మరకతవల్లి నాచ్చియార్ (పద్మిని)

పుష్కరణి: కదల్వాయి తీర్థం, వాట్టారు తీర్థం, రామ తీర్థం

విమానం: అష్టాంగ, అష్టాక్షర విమానం

ఆళ్వార్ మంగళాశాసనం: నమ్మాళ్వార్ : 3722-32 (11) )తి. మొ. 10-6-1, 3.  నాలాయిర దివ్య ప్రభందం  పాశురముల పట్టిక ప్రకారం