ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువాఱన్ విళై | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | తిరుక్కుఱళప్పన్ |
ప్రధాన దేవత: | పద్మాసనవల్లి త్తాయార్ |
దిశ, స్థానం: | ఉత్తర ముఖము |
పుష్కరిణి: | వ్యాస పుష్కరిణి |
విమానం: | వామన విమానము |
కవులు: | నమ్మాళ్వార్ |
ప్రత్యక్షం: | బ్రహ్మకు |
తిరువాఱన్ విళై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
ఈ క్షేత్రము అర్జునునిచే ప్రతిష్ఠింపబడినట్లు స్థలపురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ మూలవరులకు ప్రతి నిత్యము తిరుమంజనము, పుష్పాలంకరణము జరుగుతుంది. నమ్మాళ్వారు తిరువాయిమొళి ఏడవశతకం పదవ దశకమగు "ఇన్బం పయక్క" అను తిరువాయిమొళిలో "ఇన్బం పయక్క ఇనిదుడన్‌వీట్రిరుందు" (సుఖము కలుగునట్లుగా ప్రీతికరంగా వేంచేసియుండి) అని సమస్త లోకములకు స్వామియగు సర్వేశ్వరుడు పిరాట్టితో (శ్రీదేవి) పాటు నా తిరువాయిమొళి వినుటకై తిరువాఱన్‌విళై క్షేత్రమున వేంచేసియున్నాడు." అని సర్వేశ్వరుని ఆనందాతిశయము అను గుణమును కీర్తించారు. ఈ క్షేత్రమునకు "వీణగర్" (మహానగరము) అను పేరు ఉంది. తి.వా.మొ. 7-10-6
శ్లో. తిరువారన్ విళాఖ్యానే పురేవ్యాస స్పర స్తటే|
కురళప్పవితి శ్రీమాన్ పద్మాసన రమాపతి:||
విమానం వామనం ప్రాప్త: కుబేర హరి దానన:|
బ్రహ్మేక్షితస్థితో రేజే పరాంకుశ మునిస్తుతు:||
పా. ఆగుజ్కొల్ ఐయమొన్ఱిన్ఱి; యగలిడ ముత్‌తవుమ్ ఈరడియే
ఆగుమ్ పరిశు నిమిర్‌న్ద; తిరుక్కుఱళప్ప నమర్‌న్దుఱై యుమ్;
మాగమ్ తిగழ் కొడిమాడజ్గళ్; నీడుమదిళ్ తిరువాఱన్‌విళై
మాకన్ద నీర్ కొణ్డు తూవి వల--య్‌దు; కై తొழ క్కూడుజ్గొలో.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-10-2
శ్లో. ఇత్థం శ్రీమళయాళస్థ దివ్యదేశా స్త్రయోదశ|
మయా సంకీర్తితా శ్రీమత్ రామానుజ కృపాబలాత్||
వివ: భగవద్రామానుజులవారి కృపాబలము వలన మలయాళ దేశమున గల పదమూడు క్షేత్రములు వర్ణింపబడినవి.
శ్లో. అథద్వే మధ్య దేశస్థా వర్ణ్యతే క్షేత్ర సత్తమౌ|
రామానుజార్య కరుణా కటాక్ష బలతోమయా !
శెంగణూర్‌కు తూర్పున 10 కి.మీ. దూరంలో స్వల్ప వసతులు ఉన్న సత్రము ఉంది.