తిప్పెట్టి గణేషన్ | |
---|---|
జననం | 1990 అక్టోబర్ 16 మదురై తమిళనాడు భారతదేశం |
మరణం | 2021 మార్చి 22 (వయసు 30) మదురై తమిళనాడు, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు |
పిల్లలు | 2 |
తీపెట్టి గణేశన్ (అక్టోబర్ 16, 1990 - మార్చి 22, 2021), గణేషన్ అసలు పేరు కార్తీక్, ఒక భారతీయ నటుడు. గణేషన్ శీను రామస్వామి దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో నటనకు గాను ప్రసిద్ధి పొందాడు. రేణిగుంట (2009) సినిమాలో అద్భుతమైన నటనకు గాను గుర్తింపు తెచ్చుకున్నాడు. [1]
ఏప్రిల్ 2020లో గణేషన్, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తనకు సినిమా అవకాశాలు లేకపోవడం వల్ల తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నానని కోవిడ్ 19 మహమ్మారి సమయంలో తన సినీ కెరీర్ తీవ్రంగా దెబ్బతిందని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. [2] కోవిడ్ 19మహమ్మారి సమయంలో గణేషన్ తన కుటుంబాన్ని పోషించడానికి చిన్నపాటి వ్యాపారాలు చేసేవాడు. [3] గణేషన్ తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ప్రముఖులను కోరాడు. తోటి నటుడు స్నేహన్ గణేషన్ కు ఆర్థిక సహాయాన్ని అందించాడు. [4]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2009 | రేణిగుంట | ప్రేమ్ కుమార్ | తమిళం | |
2010 | తెన్మెర్కు పరువుకాట్రు | తమిళం | ||
2011 | ఆయుధ పోరాటం | గణేశ | తమిళ్ | |
2011 | రాజపట్టై | తమిళ్ | ||
2012 | కాదల్ పాఠై | తమిళ్ | ||
2012 | ఉస్తాద్ హోటల్ | ఇస్మాయిల్ | మలయాళం | |
2012 | బిల్లా 2 | ముత్తు | తమిళ్ | |
2012 | నీర్పరవై | తమిళ్ | ||
2014 | ఎండ్రెండ్రమ్ | తమిళ్ | ||
2015 | బుద్ధునిన్ సిరిప్పు | తమిళ్ | ||
2015 | తిరుట్టు రైలు | తమిళ్ | ||
2016 | పైసా | మురుగన్ స్నేహితుడు | తమిళ్ | |
2016 | మాండ్యా ముంబై | కన్నడ | ||
2018 | కొలమావు కోకిల | తమిళ్ | ప్రమోషనల్ సాంగ్ లో స్పెషల్ అప్పియరెన్స్ | |
2018 | తోడ్రా | శంకర్ స్నేహితుడు | తమిళ్ | |
2019 | కన్నె కలైమానే | కన్నన్ స్నేహితుడు | తమిళ్ | |
2019 | నత్పున ఎన్నను తేరియుమా | తమిళం | ||
2021 | సరిహద్దు | తమిళం | మరణానంతరం విడుదల అయిన సినిమా | |
2023 | ఉరుచిధాయ్ | తమిళం | మరణానంతరం విడుదల అయిన సినిమా | |
2023 | అన్నామలైయిన్ పోరులు | తమిళం | మరణానంతరం విడుదల అయిన సినిమా | |
TBD | ఇదమ్ పొరుల్ యేవల్ | తమిళం |
గణేషన్ 2021 మార్చి 22న అనారోగ్య కారణాలతో మదురైలో మరణించాడు. [5] [6]