తీరత్ సింగ్ రావత్

తీరత్ సింగ్ రావత్
ఉత్తరాఖండ్ 9వ ముఖ్యమంత్రి
In office
2021 మార్చి 10 – 2021 జూలై 4
గవర్నర్బేబీ రాణి మౌర్య
అంతకు ముందు వారుత్రివేంద్ర సింగ్ రావత్
లోక్‌సభ మెంబర్
In office
2019 మే 23 – 2021 మార్చి 10
అంతకు ముందు వారుబి. సి. ఖండూరీ
నియోజకవర్గం ఘర్వాల్
అసెంబ్లీ సభ్యుడు
In office
2012–2017
తరువాత వారుసప్తల్ మహారాజ్
నియోజకవర్గం చౌబట్టకల్
విధ్యా శాఖ మంత్రి
In office
2000–2002
ముఖ్యమంత్రినిత్యానంద స్వామి
ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ 6వ అధ్యక్షుడు
In office
2013 ఫిబ్రవరి 9 – 2015 డిసెంబరు 31
అంతకు ముందు వారుబిషన్ సింగ్ చుపాల్
తరువాత వారుఅజయ్ భట్
వ్యక్తిగత వివరాలు
జననం (1964-04-09) 1964 ఏప్రిల్ 9 (వయసు 60)
సీరోన్, పౌడీ గఢ్వాల్ జిల్లా, ఉత్తరాఖండ్
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
నేషనల్ డెమొక్రటిక్ అలియాన్స్
జీవిత భాగస్వామిరష్మీ త్యాగి రావత్
వెబ్‌సైట్Official website

తీరత్ సింగ్ రావత్, భారతీయ జనతా పార్టీ  చెందిన రాజకీయ నాయకుడు. ఉత్తరాఖండ్ తొమ్మిదో ముఖ్యమంత్రిగా 2021 మార్చి 10 నుండి 2021 జులై 4 వరకు పనిచేసాడు. 2019 భారత సాధారణ ఎన్నికల్లో గర్హ్వాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[1][2] తీరత్ సింగ్ రావత్ 2013 ఫిబ్రవరి 9 వ తారీకు నుండి 2017 డిసెంబరు 31 వరకు ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

తీరత్ సింగ్ రావత్ 1964లో  ఘర్వాల్ జిల్లా పౌరి గ్రామంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కలం సింగ్ రావత్ ఇంకా గౌరీ దేవి. ఇతను జర్నలిజంలో డిప్లమా అలాగే సోసియోలజీలో మాస్టర్స్ డిగ్రీలను పొందాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

తీరత్ సింగ్ రావత్ విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచేవాడు తను విద్యార్థిగా ఉన్నప్పుడే ఉత్తరాఖండ్ ఏబీవీపీ సెక్రెటరీగా ఉన్నాడు ఆ తర్వాత జాతీయస్థాయి సెక్రెటరీగా ఎన్నికైయ్యాడు.  అతను కళాశాలలో చదువుకునేటప్పుడు హేమవతి నందన్ బహుగుణ అగర్వాల్ యూనివర్సిటీలో విద్యార్థి యూనియన్ కి నాయకత్వం వహించాడు ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. 1983 నుండి 1988 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో సభ్యునిగా ప్రచారక్ గా ఉన్నాడు.

కొత్తగా ఏర్పడిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మొదటి విద్యా శాఖ మంత్రిగా తీరత్ సింగ్ బాధ్యతలు నిర్వహించాడు. 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2013లో ఉత్తరాఖండ్ బిజెపి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. ఉత్తరాఖండ్ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాడు.  ఆ తర్వాత 2019 మే 23న గర్హ్వాల్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

2021 మార్చి 10న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. 116 రోజులు పనిచేసి, (2021 జులై 2 వరకు) ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Mar 10, TIMESOFINDIA COM / Updated:; 2021; Ist, 19:05. "Tirath Singh Rawat: All you need to know about the new chief minister of Uttarakhand | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-06. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  2. 2.0 2.1 "Tirath Singh Rawat: From RSS pracharak to Uttarakhand chief minister". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-03-10. Retrieved 2021-06-06.