తూఫాన్ | |
---|---|
దర్శకత్వం | రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా |
రచన | అంజుమ్ రాజబలి విజయ్ మౌర్యా ఫర్హాన్ అక్తర్ (కథ మూలం) |
నిర్మాత | రితేశ్ సిద్వానీ ఫర్హాన్ అక్తర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా |
తారాగణం |
|
Narrated by | విజయ్ రాజ్ |
ఛాయాగ్రహణం | జే ఓజా |
కూర్పు | మేఘ్నా సేన్ |
సంగీతం | శంకర్-ఎహసాన్-లాయ్ దుబ్ శర్మ శామ్యూల్-ఆకాంక్ష డేనియల్ |
పంపిణీదార్లు | అమెజాన్ ప్రైమ్ |
విడుదల తేదీ | 16 జులై 2021 |
సినిమా నిడివి | 162 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
తుఫాన్ 2021లో విడుదలైన హిందీ సినిమా. ఫర్హాన్ అక్తర్, మృణాల్ ఠాకూర్, పరేష్ రావల్, మోహన్ అగషే, హుస్సేన్ దలాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను రితేశ్ సిద్వానీ, ఫరాన్ అక్తర్, రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా నిర్మించగా రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ 16 జులై 2021న విడుదలైంది.
ముంబై డోంగ్రీలో పుట్టి పెరిగిన అజీజ్ అలీ ఉరఫ్ అజ్జూభాయ్ (ఫర్హాన్ అక్తర్) ఒక స్ట్రీట్ ఫైటర్. జాఫర్ భాయ్ (విజయ్ రియాజ్) అనే రౌడీ దగ్గర అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారి నుండి డబ్బులను వసూలు చేసే వాడిగా పని చేస్తుంటాడు. అలాంటి అజ్జూభాయ్ కి జిమ్ ఓనర్ ఒకతను లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీ వీడియోలను చూపిస్తాడు.దీనితో ఆయనకు బాక్సింగ్ పై ఆశక్తి కలుగుతుంది. అప్పటి నుంచి కొట్లాటలు మానేసి బాక్సింగ్ పైన శ్రద్ద పెడతాడు , కానీ అతనికి మంచి ట్రైనింగ్ ఇచ్చే కోచ్ కావాలి , కోచ్ గా పనిచేస్తున్న ప్రభు (పరేష్ రావల్) కి ముస్లిమ్స్ అంటే అస్సలు నచ్చదు. ఇపుడు అలీ , ప్రభు ని కోచ్ గా ఉండటానికి ఎలా ఒప్పిస్తాడు ? అలీ బాక్సింగ్ కోసం పడిన కష్టాలు ఏంటి ? చివరికి అలీ బాక్సింగ్ రింగ్ మెట్లు ఎక్కగలిగాడా లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[1][2]