తులసిమతి మురుగేశన్ | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||
దేశం | ![]() | ||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
తులసిమతి మురుగేశన్ తమిళనాడులోని కాంచీపురానికి చెందిన పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. చైనా గాంగ్జౌలో జరిగిన 2022 ఆసియా పారా గేమ్స్ లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1] ఆమె పారా బ్యాడ్మింటన్ పోటీలలో ఎస్ఎల్3-ఎస్యు5, ఎస్యు5 తరగతులలో మూడు పతకాలు గెలుచుకుంది.
డిసెంబరు 2023లో, 5వ ఫజ్జా దుబాయ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ 2023లో మానసి జోషి భాగస్వామ్యంతో జరిగిన మహిళల డబుల్స్ లో తులసిమతి బంగారు పతకాన్ని గెలుచుకుంది.[2] ఆ తర్వాత నితీష్ కుమార్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3, ఎస్యూ5లో మరో కాంస్యం గెలుచుకుంది. మానసితో పాటు, ఆమె ప్రపంచ పారా-బ్యాడ్మింటన్ డబుల్స్ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానంలో ఉంది.[3] ఆమె హైదరాబాదులో గోపీచంద్, ఇర్ఫాన్ కోచ్ ల వద్ద శిక్షణ పొందుతోంది.[4] ఆమెకు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ మద్దతు ఇస్తుంది.[5]
హాంగ్జౌలో జరిగిన 4వ ఆసియా పారా గేమ్స్ లో ఆమె మూడు పతకాలు, బంగారు, వెండి, కాంస్యం గెలుచుకుంది.[6] ఆమె 2023 అక్టోబరు 25న నితీష్ కుమార్ తో కలిసి మిశ్రమ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 తరగతి జతలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె అక్టోబరు 27న మహిళల డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5లో మానసి జోషితో కలిసి రజత పతకాన్ని గెలుచుకుంది. వ్యక్తిగత మహిళల సింగిల్స్ ఎస్యు5 తరగతిలో స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది.[7][8]
తులసిమతి 2023లో తన అద్భుత ఆటతీరుకు గాను స్పోర్ట్స్టార్ ఏసెస్ (Sportstar Aces) అవార్డ్స్ 2024 స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.[9]
మహిళల డబుల్స్
సంవత్సరం | వేదిక | భాగస్వామి | ప్రత్యర్థి | స్కోర్ | ఫలితం |
---|---|---|---|---|---|
2024 | పట్టాయా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ హాల్, పట్టాయా, థాయిలాండ్ |
మానసి జోషి![]() |
లెయనీ రాత్రి ఒక్టిలా ![]() ![]() |
20–22, 17–21 | ![]() |
{{cite web}}
: CS1 maint: unrecognized language (link)