తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే | |
---|---|
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ MMRDA,[1] MSRDC | |
పొడవు | 23.55 కి.మీ. (14.63 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
ఉత్తర చివర | ఠాణే |
భాండప్‌లో భాండప్-ఐరోలి వంతెన రోడ్డు విఖ్రోలిలో JVLR చెంబూర్‌లో SCLR | |
దక్షిణ చివర | ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మినస్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | మహారాష్ట్ర |
Major cities | ఠాణే, ముంబై |
రహదారి వ్యవస్థ | |
తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే (ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే - EEH) ముంబై, థానే నగరాల మధ్య ఉన్న 23.55 కి.మీ. (14.63 మై.) పొడవున్న బగర ఎక్స్‌ప్రెస్ హైవే.[2] ఇది ముంబై మెట్రోపాలిటన్ ఏరియాలో అత్యంత రద్దీగా ఉండే, అత్యంత ముఖ్యమైన రహదారులలో ఒకటి. ఇది జాతీయ రహదారి 48 లో భాగం. ఇది ముంబై నగరాన్ని తూర్పు శివారు ప్రాంతాలకూ, థానే మెట్రోపాలిటన్ ప్రాంతానికీ కలిపే ఉత్తర-దక్షిణ ప్రధాన రహదారి. దాని నడకలో ఎక్కువ భాగం, డజనుకు పైగా ఫ్లైఓవర్‌లు/గ్రేడ్ సెపరేటర్‌లతో 6 వరుసల వెడల్పుతో (ఒక్కో దిశలో 3 వరుసలు) ఉంటుంది.
ఈ హైవే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వద్ద ప్రారంభమై థానే వరకు వెళ్తుంది.[3] చెంబూర్ వద్ద ఇది RCF జంక్షన్ (ప్రియదర్శిని) వద్ద సియోన్ పన్వెల్ హైవే నుండి చీలి నగరం బయటి సరిహద్దుల వరకు వెళ్తుంది. రద్దీ సమయాల్లో దీనిపై ట్రాఫిక్ చాలా భారీగా ఉంటుంది - ఉదయం రద్దీ సమయంలో దక్షిణం వైపూ, సాయంత్రం సమయంలో ఉత్తరం వైపూ ట్రాఫిక్ బాగా ఉంటుంది. దీనిపై ప్రతిరోజూ 50,000 కార్లు ప్రయాణిస్తాయి. దక్షిణం వైపుగా, సియోన్ దాటాక దీన్ని డాక్టర్ అంబేద్కర్ రోడ్డు అంటారు. సెంట్రల్ ముంబైలోని సియోన్‌ను థానే తోటీ, దానొఇ తరువాతా కలిపే ముఖ్యమైన రోడ్లలో తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవే ఒకటి.
పశ్చిమ, తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేలను కలిపే జోగేశ్వరి-విఖ్రోలి లింక్ రోడ్ (JVLR), శాంటా క్రజ్-చెంబూర్ లింక్ రోడ్ (SCLR) లాంటి లింక్ రోడ్లు, ముంబై శివారు రోడ్ల నెట్‌వర్కు లోని ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు. పశ్చిమ, తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేలు రెండూ ఉత్తర - దక్షిణ దిశలో నడుస్తాయి. కొన్ని విభాగాలలో ఈ రెండూ సమాంతరంగా ఉంటాయి.[4]
2009లో, బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (BEST) సంస్థ ఈ హైవేపై మరిన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బెస్ట్ ఈ మార్గంలో ఎయిర్ కండిషన్డ్ (AC) బస్సులను కూడా ప్రవేశపెట్టింది. ఈ బస్సులు హైవేపై ఉన్న ఫ్లై ఓవర్లను ఉపయోగిస్తాయి, తద్వారా ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి.