తూర్పు జయప్రకాశ్ రెడ్డి | |||
| |||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2004-2009, 2009-2014, 2018-2024 డిసెంబర్ 3[1] | |||
నియోజకవర్గం | సంగారెడ్డి నియోజకవర్గం | ||
---|---|---|---|
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 28 జూన్ 2021 | |||
అధ్యక్షుడు | రేవంత్ రెడ్డి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఇంద్రకరణ్, కంది మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, | 1966 జూలై 7||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | జగ్గారెడ్డి - జామాయమ్మ | ||
జీవిత భాగస్వామి | టి.నిర్మలా రెడ్డి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జగ్గారెడ్డిగా ప్రసిద్ధి చెందిన తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[3] కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రాంరంభించి, మున్సిపాలిటి చైర్మెన్‌గా, శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్‌గా పదవులు నిర్వహించాడు. 2021, జూన్ 28 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు.
జయప్రకాశ్ రెడ్డి 1966, జూలై 7న జగ్గారెడ్డి - జామాయమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, కంది మండలంలోని ఇంద్రకరణ్ గ్రామంలో జన్మించాడు.[4] పదవ తరగతి వరకు చదువుకున్నాడు.[5]
జయప్రకాశ్ రెడ్డికి కె. నిర్మలతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[6]
1986లో భారతీయ జనతా పార్టీ తరఫున సంగారెడ్డి పురపాలక సంఘం కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, 1995లో సంగారెడ్డి పురపాలక సంఘం చైర్మెన్ అయ్యారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున 12వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ పోటీచేసి తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కె. సత్యనారాయణపై 17,676 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై 2012 నుంచి 2014 మధ్య ప్రభుత్వ విప్‌గా పనిచేశాడు.[7] 2014 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో 29,814 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.[8] 2014లో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెరాస చేతిలో ఓడిపోయారు. మెదక్ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన తరువాత 2015లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[9] 2018 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ పై 2,522 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[10] ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.[11]