తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అనేది భారతదేశ దక్షిణ ప్రాంతంలోని తెలంగాణ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.[1][2] రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసిన పేర్వారం రాములు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మొదటి చైర్మన్‌గా నియమితులయ్యాడు.[3] తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల జాబితాలో చారిత్రక ప్రదేశాలు, స్మారక చిహ్నాలు, కోటలు, జలపాతాలు, అడవులు, దేవాలయాలు ఉన్నాయి.
ప్రపంచంలో చూడదగిన ఉత్తమ ప్రదేశాలలో గురించి 2015లో ట్రావెలర్ మ్యాగజైన్ ప్రకటించిన జాబితాలో రాష్ట్ర రాజధాని హైదరాబాదు 2వ స్థానంలో నిలిచింది.[4]
చార్మినార్, 1591లో మూసీ నదికి తూర్పు ఒడ్డున నిర్మించబడింది, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్న ఒక స్మారక చిహ్నం, మసీదు. భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాల జాబితాలో చేరిన కట్టడం హైదరాబాదుకు ప్రపంచ చిహ్నంగా మారింది. చార్మినార్ కు ఈశాన్యంలో లాడ్ బజార్, పశ్చిమాన గ్రానైట్‌తో నిర్మించిన మక్కా మసీదు ఉంది.
గోల్కొండ కోట: ఒకప్పుడు కుతుబ్ షాహీలచే పాలించబడిన గోల్కొండ కోట భారతదేశంలోని అత్యంత అద్భుతమైన కోట సముదాయాలలో ఒకటిగా నిలుస్తోంది.
కాకతీయ కళా తోరణం: కాకతీయ రాజవంశంలో వరంగల్ జిల్లాలో నిర్మించిన ఒక చారిత్రిక తోరణం, చిహ్నం.[5] దాదాపు 1200 సంవత్సరంలో కాకతీయ రాజవంశం పాలనలో ఈ తోరణాన్ని నిర్మించారు.[6] ఇది తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోకి తీసుకోబండింది.[7][8]
భువనగిరి కోట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఉన్న ఒక కోట.[9] 10వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య పాలకుడు ఆరవ త్రిభువనమల్ల విక్రమాదిత్య చే వివిక్త ఏకశిలా శిలపై నిర్మించబడింది. అతని పేరు మీద దీనికి త్రిభువనగిరి అని పేరు పెట్టబడింది. సముద్ర మట్టానికి 609.6 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోట రాణి రుద్రమదేవి, ఆమె మనవడు రెండవ ప్రతాపరుద్రుని పాలనలో ఉండేది.[10]
పైగా సమాధులు: హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న ఈ సమాధులు ఎక్కడా లేనివిధంగా ప్రత్యేకమైన రేఖాగణిత శిల్పాలతో ఇటీవలే కనుగొనబడిన సమాధులు.
కులపక్జి (కొలనుపాక దేవాలయం): యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక గ్రామంలో ఉన్న 2,000 సంవత్సరాల పురాతన జైన దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా, అత్యాధునిక వాస్తుశిల్పాలు, శిల్పకళకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి రిషభంత మాణిక్యసామి విగ్రహం మొదట రావణుని భార్య మండోదరిచే పూజించబడిందని, దీనిని కల్యాణ పాలకుడు శంకర్ ఇక్కడకు తీసుకువచ్చారని చెబుతారు.[11] దేవాలయం లోపలిభాగం ఎర్ర ఇసుకరాయి, తెల్లని పాలరాయితో చేయబడింది.[12]
యాదగిరిగుట్ట: ఇక్కడి ప్రధాన దైవం లక్ష్మీ నరసింహ స్వామి.[13] రుష్యశృంగ మహర్షి కుమారుడైనరీ యాదమహర్షి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో నరసింహస్వామి కోసం ఘోర తపస్సు చేసాడు. తన తపస్సు కోసం అనుగ్రహం పొందిన తరువాత నరసింహ భగవానుడు శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ యోగానంద నరసింహ, శ్రీ ఉగ్ర నరసింహ, శ్రీ గండబేరుండ నరసింహ, శ్రీ లక్ష్మీ నరసింహ అనే ఐదు అవతారాలలో ప్రత్యక్షమయ్యాడు. అందుకే దీనిని "పంచ నరసింహ క్షేత్రం" అంటారు.
వేయి స్తంభాల దేవాలయం: కాకతీయులచే నిర్మించబడిన దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఈ వేయి స్తంభాల దేవాలయం ఒకటి. సా.శ..1163లో రాజు రుద్రదేవుడు వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. ఇది 12వ శతాబ్దంలో కాకతీయుల నిర్మాణ శైలికి చెందిన ఈ దేవాలయంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి.
రామప్ప దేవాలయం: దేవాలయంలోని ఒక శాసనం 1213 సంవత్సరం నాటిది, కాకతీయ పాలకుడు గణపతిదేవుని కాలంలో జనరల్ రేచర్ల రుద్రుడు నిర్మించినట్లు చెబుతారు.[16]
బిర్లా మందిర్, హైదరాబాదు: హైదరాబాద్‌లోని 13 ఎకరాల (53,000 మీ2) విస్తీర్ణంలో నౌబత్ పహాడ్ అని పిలువబడే 280 అడుగుల (85 మీ) ఎత్తైన కొండపై ఈ బిర్లామందిర్ నిర్మించబడింది.
నేలకొండపల్లి: భద్రాచలంలో సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని నిర్మించిన భక్త రామదాసు జన్మించిన గ్రామం. 3వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద బుధ స్థూపం 'బుధ స్థూపం' ఇక్కడ ఉంది.
మెదక్ చర్చి: తెలంగాణలోని అతిపెద్ద చర్చి, కేథడ్రాల్ చర్చి మెదక్‌లో ఉంది. మెదక్ డియోసెస్ ఆసియాలోని అతిపెద్ద డియోసెస్, వాటికన్ తర్వాత ప్రపంచంలో రెండవది.[18] రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ ఆధ్వర్యంలో ఈ చర్చి నిర్మించబడింది. చార్లెస్ పోస్నెట్ 1895లో సికింద్రాబాద్‌కు వచ్చి, త్రిముల్గేరీలో బ్రిటిష్ సైనికులలో మొదటి మంత్రిగా పనిచేశాడు. గ్రామాలలోకి ప్రవేశించి 1896లో మెదక్ గ్రామానికి చేరుకున్నాడు.[19]
మల్లెల తీర్థం: శ్రీశైలం నుండి 58 కి.మీ.ల దూరంలో, హైదరాబాద్ నుండి 173 కి.మీ.ల దూరంలోని దట్టమైన నల్లమల అడవిలో ఉన్న జలపాతం.
భీముని పాదం జలపాతం: గూడూరు బస్టాండ్ నుండి 10 కి.మీ.ల దూరంలో, వరంగల్ నుండి 51 కి.మీ.ల దూరంలో, ఖమ్మం బస్ స్టేషన్ నుండి 88 కి.మీ.ల దూరంలో, హైదరాబాద్ నుండి 200 కి.మీ.ల దూరంలో ఈ భీముని పాదం ఉంది.
పొచ్చెర జలపాతం: నిర్మల్ నుండి 40 కి.మీ.ల దూరంలో, ఆదిలాబాద్ నుండి 50 కి.మీ.ల దూరంలో, హైదరాబాద్ నుండి 257 కి.మీ.ల దూరంలో, కుంటాల జలపాతం నుండి 22 కి.మీ.ల దూరంలో ఉన్న జలపాతం.
గాయత్రీ జలపాతాలు: తర్నామ్ ఖుర్ద్ గ్రామం నుండి 5 కి.మీ.ల దూరంలో, కుంటాల జలపాతం నుండి 19 కి.మీ.ల దూరంలో, నిర్మల్ నుండి 38 కి.మీ.ల దూరంలో, ఆదిలాబాద్ 59 కి.మీ.ల దూరంలో, హైదరాబాద్ నుండి 270 కి.మీ.ల దూరంలో ఉన్న జలపాతం.
నిర్మల్ పట్టణం హస్తకళలు, పెయింటింగ్‌లకు ప్రసిద్ధి చెందింది.
బడాపహాడ్ దర్గా లేదా పెద్దగుట్ట ఈ ప్రాంతంలోని పురాతన ముస్లీం యాత్రా కేంద్రాలలో ఒకటి. సాధువు సయ్యద్ సాధుల్లా హుస్సేన్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ దర్గా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా సమీపంలోని కొండపై నిర్మించబడింది.
↑"Places of Interest". Archived from the original on 2015-09-08. Retrieved 2021-12-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"Archive News". The Hindu. 2007-06-12. Archived from the original on 4 February 2010. Retrieved 2021-12-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑"Medak Cathedral". Prasar Bharti (All India Radio). 25 September 2013. Retrieved 2021-12-30.
↑"stjohnschurchcsi.org". Archived from the original on 8 May 2008. Retrieved 2021-12-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
↑Kuchadri temple. "Kuchadri Venkateswara Swamy Temple in Medak". yatrastotemples.com. Archived from the original on 2016-07-18. Retrieved 2021-12-30. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)