2 మార్చి 2020 (4 సంవత్సరాలు, 8 నెలలు, 1 వారం , 3 రోజులు)[1]
మూల స్థానం
వుహాన్ , హుబీ , చైనా
కేసులు నిర్ధారించబడింది
2,47,284 (5 నవంబరు 2020)
బాగైనవారు
2,26,646 (5 నవంబరు 2020)
క్రియాశీలక బాధితులు
19,272
మరణాలు
1,366 (5 నవంబరు 2020)
చైనాలో పుట్టి ప్రపంచమంతటా విస్తరించిన కరోనా వైరస్ (కోవిడ్ 19) తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించుకుంది. తెలంగాణ 2020 మార్చి 2 తొలి కరోనా వైరస్ కేసు నమోదనట్టు అధికారులు ప్రకటించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని నిర్ధారించారు.
తెలంగాణ ప్రభుత్వం 87.59 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు 12 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తాం అని వెల్లడించింది. నిత్యవసరాలు కొనుగోలు చేయడానికి వీలుగా తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ.1500 చొప్పున నగదు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.[2]
కరోనా వైరస్ వేగంగా విస్తరించకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త రాష్ట్రంలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులను, బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, సెమినార్లు, ఉత్సవాలు, ఎగ్జిబిషన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిషేధించారు. జూ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, మ్యుజియమ్స్, సినిమా హాళ్లు, బార్లు, పబ్బులు, క్రీడా ప్రాంగణాలు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ లు మూసివేయబడతాయని ముఖ్యమంత్రి కెసీఆర్ తెలిపారు.
మార్చి 31 వరకు ఎక్కువగా జనాభా ఉన్నా ప్రాంతాల్లో ఆంక్షలు,ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు కుటుంబ సభ్యల మధ్యే జరుపుకోవాలని సూచించారు.
కరోనా బాధితుల చికిత్సకోసం 4 క్వారంటైన్ కేంద్రాలు, 321 ఐసీయూ పడకలు, 240 వెంటిలేటర్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపిన సీఎం రూ. 500 కోట్ల ప్రత్యేక నిధిని, వైద్య ఆరోగ్యం, మున్సిపల్, పంచాయితీ రాజ్, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వద్ద 18 చెక్ పోస్టులు ఏర్పాటుచేసి ప్రయాణికులకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విదేశీ ప్రయాణం చేసినవారిని గృహ నిర్బంధంలో ఉంచారు.
రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు,ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నిత్యావసర సరుకులు,కూరగాయల ధరలు పెంచితే పీడీయాక్ట్ పెట్టి జైలుకు పంపుతాం ప్రభుత్వం పేర్కొంది.
రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 గంటల కల్లా అన్ని దుకాణాలు మూసేయాలి.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
మార్చి 22 న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది..[3]మార్చి 23 న రాష్ట్ర ప్రభుత్వం రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. తెలంగాణ ప్రభుత్వం అన్ని సరిహద్దులను మూసివేసి రవాణాను నిలిపివేసింది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా లాక్ డౌన్ మే 7 వరకు పొడిగించారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు 2020 మార్చి 20 ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం జరగనున్న పరీక్ష యథాతథంగా కొనసాగించాలని పేర్కొన్నారు. మార్చి23 నుంచి మార్చి 30వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు తెలిపింది.[4]
జూన్ 8కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలు రద్దు చేశారు.ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రంలో ఉన్న 5,34,903 విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.[5]
మాంసం తింటే కరోనా వైరస్ వస్తుందని, ఒక పుకారు సోషల్ మీడియాలోలో వైరల్ అయ్యింది. దీని వలన ట్విట్టర్‌లో "#NoMeat_NoCoronaVirus" ట్విట్టర్‌లో వైరల్ అయింది. [6] ఈ పుకార్లను అరికట్టడానికి క్షీణిస్తున్న అమ్మకాలను ఎదుర్కోవటానికి, కొన్ని పౌల్ట్రీ పరిశ్రమ సంఘాలు హైదరాబాద్‌లో "చికెన్ అండ్ ఎగ్ మేళా"ను నిర్వహించాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చేయబడిన కొన్ని ఉచిత గుడ్లు, వేయించిన చికెన్లను తిన్నారు. [7]