తెల్ల బంగారం చెట్టు | |
---|---|
Flower in West Bengal, India. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | B. acuminata
|
Binomial name | |
Bauhinia acuminata |
తెల్ల బంగారం చెట్టును తెలుపు దేవకాంచనం అని కూడా అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం బహీనియా అక్యూమినటా. దేవ కాంచనం చెట్టు వలె కనిపించే ఈ చెట్టు పుష్పాలు తెల్లగా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ చెట్టు యొక్క పూలు తెల్లగా ఉండుట వలన ఈ చెట్టుకి తెల్ల బంగారం చెట్టు అని పేరు వచ్చింది. ఈ చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది.
బహీనియా అక్యుమినటా ఉష్ణమండల ఆగ్నేయ ఆసియాకు చెందిన పుష్పించే పొద జాతి.[1] విస్తృతమైన సాగు కారణంగా ఖచ్చితమైన స్థానిక పరిధి గూర్చి వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. కానీ బహుశా మలేషియా, ఇండోనేషియా (జావా, బోర్నియో, కాలిమంటన్, లెస్సర్ సుండా దీవులు), ఫిలిప్పీన్స్ దీవులలో ఉంటాయి. [2]
ఇది రెండు నుండి మూడు మీటర్ల పొడవు పెరుగుతుంది. ఇతర బహీనియా రకాల వలె కాకుండా వీటి ఆకులు ద్విదళాలు కలిగి ఉంటాయి. ఇవి ఎద్దు గిట్టల ఆకారంలో ఆకులు కలిగి ఉంటాయి. అవి 6 నుండి 15 సెంటీమీటర్ల పొడవు కలిగి కలిగి ఉంటాయి. పువ్వులు సువాసన కలిగి 8 నుండి 12 సెం.మీ వ్యాసాన్ని కలిగి, ఐదు దళాలను పది పసుపు కేశరాలను కలిగి ఆకుపచ్చని కాడను కలిగి ఉంటాయి. వీటి కాయలు 7.5 సెం.మీ నుండి 15 సెం.మీ పొడవు 1.5 నుండి 1.8 సెం.మీ వెడల్పు కలిగి ఉంటాయి. ఇవి ఆకురాల్చు అరణ్యాలలో ఎక్కువగా లభిస్తాయి.[3][4][5]