తేజి గ్రోవర్భారత దేశానికి చెందిన హిందీ కవయిత్రి, [1] కాల్పనిక రచయిత్రి, [2] అనువాదకురాలు, చిత్రకారిణి. 1950 తరువాతి తరాల వారికి హిందీ కవయిత్రిగా ఈమె బాగా పరిచయం. ప్రముఖ హిందీ కవి, విమర్శకుడు అశోక్ వాజ్ పేయ్, తేజి కవిత్వం గురించి వివరిస్తూ "ఆమె కవిత్వంలోని భాష ప్రత్యేకంగా ఉంటుంది. సామాన్యమైన జాతీయాలకు అందకుండా ఎంతో విచిత్రమైన భాష వాడుతుంది" అని చెప్తాడు.[3] ఆమె కవితలు ఇతర భారతీయ భాషల్లోకి మాత్రమే కాక, విదేశీ భాషల్లోకి కూడా అనువాదం కావడం విశేషం.
తేజి కాల్పనిక సాహిత్యంలోని శిల్పం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె రచనల్లో భావుకత, వాస్తవికత ఒక దానిలో ఒకటి కలిసిపోయి ఉంటాయి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలోని కథలు అన్ని ఒక దానితో ఒకటి ముడి వేసుకుని ఉన్నట్టుగా ఉంటుంది. ఈమె రాసిన నీల గురించి ప్రముఖ హిందీ పండితురాలు కమిలా జునిక్ రాస్తూ "తేజి ఈ నవలలో అన్ని పాత్రల గురించి, అన్ని సందర్భాల గురించీ రాసేసింది. ఈ నవలను దాటి ఇక ప్రపంచంలో రాయడానికి వేరేది ఏదైనా ఉందని నాకు అనిపించడం లేదు" అని చెప్పడం విశేషం.[4]
తేజి వివిధ భాషల రచనలను ఎన్నింటినో హిందీలోకి అనువదించింది. తన అనువాదాల ద్వారా ఆధునిక స్కాండనవి భాషలకు చెందిన ప్రముఖ కవులను, రచయితలను హిందీ పాఠకులకు పరిచయం చేసింది. ఆమె క్నట్ హమ్సన్, టర్జేయ్ వెసాస్, జాన్ ఫాస్సీ, క్జెల్ అస్కిల్డ్సన్, గన్నర్ బ్జోర్లింగ్, హాన్స్ హెర్బ్ జొర్న్ స్రడ్, లార్స్ అమండ్ వాగ్, ఎడిత్ సోడెర్గ్రన్, హారీ మార్టిన్ సన్, తోమస్ ట్రాన్స్ట్రోమర్, లార్స్ లండ్క్విస్ట్, అన్ జాడర్లండ్ వంటి ఎందరో ప్రముఖుల రచనలు అనువదించింది. తేజి, వివాదాస్పద ఫ్రెంచి రచయిత మార్గరెట్ డారస్ రచనలు కూడా అనువాదం చేసింది.
ఆమె చిత్రకారిణిగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తేజి ఎక్కువగా అమూర్త చిత్రాలు గీస్తుంది. ఆమె కృత్రిమ రంగులను వాడదు. తానే స్వంతంగా ప్రకృతి సహజమైన రంగులను తయారు చేసుకుని, వాటినే తన చిత్రాల్లో ఉపయోగించడం విశేషం.[5]
తేజి, పంజాబ్లోనిపఠాన్ కోట అనే పట్టణంలో 1955 మార్చి 7న జన్మించింది.[6]చండీగఢ్లోని ఎం.సి.ఎం.డి.ఎ.వి కళాశాలలో రెండు దశాబ్దాల పాటు ఆంగ్ల సాహిత్యం ప్రొఫెసర్ గా పనిచేసింది. ఆమె 2003లో పదవీ విరమణ చేసింది. ఆ తరువాత నుంచి పూర్తిస్థాయిలో రచయిత్రిగా, చిత్రకారిణిగా మారింది.
లో కహా సంబారీ రెండవ ప్రచురణని వాణీ ప్రకాశన్, ఢిల్లీలో 2016 ప్రచురించారు. (ISBN978-93-5229-362-9).
ఆమె రాసిన కవితా సంకలనాలు:
జైసే పరంపరా సజాతే హుయే (పరగ్ ప్రకాశన్, ఢిల్లీ, 1982), ఈ సంకలనంలో ముగ్గురు సహ కవుల కవితలు కూడా ప్రచురింపబడ్డాయి.;
తేజి ఔర్ రుస్తుం కీ కవితాయేన్ (ISBN978-81-7223-879-7), [11] ఈ కవితా సంకలనాన్ని హార్పర్ కోలిన్స్ ఇండియా వారు 2009లో ప్రచురించారు.
ఆమె ఇటీవల రాసిన కొన్ని కవితలను సమాలోచన్ అనే అంతర్జాల సాహిత్య పత్రికలో ప్రచురించారు.[12]
1999లో ఆమె నీలా అనే నవల రాసింది.ISBN81-7055-668-6) ; 2009లో ఆమె రాసిన చిన్న కథలన్నింటినీ సప్నే మే ప్రేమ్ కీ సాత్ కహానియా అనే పుస్తకంగా సంకలనం చేసి, ఢిల్లీలోని వాణీ ప్రకాశన్ ద్వారా ప్రచురించింది. ISBN9350001136). 2016లో నీలా నవల రెండో ముద్రణ వచ్చింది. ISBN978-81-7055-668-8).
ఆమె ఎన్నో వ్యాసాలను, యాత్రా విశేషాలను, జానపద కథలను రాసింది. వీటిలో కొన్నిటిని 2016లో నీలా ఘర్ ఔర్ దూసరీ యాత్రాయే పేరుతో ప్రచురించింది. ISBN978-93-5229-365-0) ;
అలాగే మరికొన్ని వ్యాసాలను 2017లో భోపాల్ లో ఏకలవ్య ప్రచురణల ద్వారా అకమ్ సే పురం తక్: లోక్ కథాయో కా ఘర్ ఔర్ బాహర్ పేరుతో పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. ISBN978-93-85236-21-1).[13]
↑See, Ashok Vajpeyi's preface to Teji Grover and Rustam Singh, Teji aur Rustam Ki Kavitaen, selected poems of both poets, New Delhi: HarperCollins, ISBN978-81-7223-879-7, Hindi-language. Accessed on 17 April 2015.
↑See, Teji Grover and Rustam Singh, Teji aur Rustam Ki Kavitaen, selected poems of both poets, New Delhi: HarperCollins, ISBN978-81-7223-879-7, Hindi-language. Accessed on 17 April 2015.